AP State Women's Commission : మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. మహిళల అక్రమ రవాణా,లైంగిక వేధింపులు నిరోధించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సమావేశమయ్యారు. అనంతపురం జిల్లాలో దేవదాసి వ్యవస్థ ఇంకా నడుస్తోందని అధికారులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. వీటిని అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఇళ్ళలో జరిగే లైంగిక వేధింపులను అరికట్టేందుకు జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి : night curfew in ap: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ వాయిదా.. ఎందుకంటే