భారతదేశం లౌకిక రాజ్యమని.. అన్ని మతాలు సమానమేనని తెలుపుతూ... గుంటూరులో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా పాస్టర్లు సమూహం ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్న తరుణంలో... కొందరు మతాలు మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. దానిని నివారించడానికి శాంతియుత ర్యాలీ నిర్వహించినట్లు పాస్టర్ల సంఘం పెద్దలు చెప్పారు. దేవాలయాలపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. మనుషులు శాంతియువతంగా భక్తిచింతనతో జీవించడానికి మతాలు దోహదపడుతున్నాయన్నారు. దేశాన్ని ప్రేమించడం అందరీ బాధ్యతని... రాష్ట్రంలో మతసామరస్యాన్ని నెలకొల్పాడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు.
ఇవీ చదవండి