- అమర్నాథ్లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
అమర్నాథ్ వరదలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడారు. యాత్రికులను కాపాడడమే తమ ప్రథమ కర్తవ్యమని అమిత్ షా తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 10మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
- జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) హత్యకు గురయ్యారు. శుక్రవారం దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రాణాలు విడిచినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. పార్లమెంట్ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు.
- అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారం: సీఎం జగన్
అధికారమంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారమంటూ నిరూపించామని వైకాపా అధినేత, సీఎం జగన్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ప్రజల కోసమే బతికామని చెప్పారు. 2009 నుంచి ఇప్పటివరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు.
- వైకాపా ప్లీనరీలో.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి : చంద్రబాబు
జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్కరూ సంతోషంగా లేరని.. ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించిన బాబు.. వైకాపా సర్కారుపై ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. ప్రతివర్గాన్నీ అవస్థలకు గురిచేస్తున్న ప్రభుత్వంపై పోరాటానికి ఇంటికి ఒకరు చొప్పున రావాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనను దునుమాడిన అధినేత.. తాను సంధించిన ప్రశ్నలకు ప్లీనరీ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
- 'సకాలంలో నియామకాలు పూర్తి చేయండి'
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగబద్ధమైన హోదా, స్వతంత్ర అధికారాల ఆలంబనగా ప్రతిభావంతులను వ్యవస్ధకు అందించేలా పని చేయాలని.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విశాఖపట్నం వేదికగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుల స్టాండింగ్ కమిటీ సదస్సులో వర్చువల్ మోడ్‌లో ఆయన పాల్గొన్నారు.
- పాఠశాలల విలీనంపై కొనసాగుతున్న ఆందోళనలు
పాఠశాలల విలీనంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మా బడి మాకే కావలంటూ విద్యార్థుల నినదిస్తున్నారు. చిన్నారులను దూర ప్రాంతాలకు పంపలేమంటూ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దిగివచ్చే వరకూ ఆందోళనలు కొనసాగుతాయని తేల్చిచెబుతున్నారు.
- శిందే నియామకంపై సుప్రీంకు ఉద్ధవ్..
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఉద్ధవ్ వర్గం. ఈ వ్యాజ్యంపై ఈ నెల 11న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు శివసేన గుర్తు 'విల్లు- బాణం' తమకే ఉంటుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
- త్వరపడండి.. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు తరుణమిదే!
ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను జులై 31వ తేదీలోగా సమర్పించాలి. అయితే పన్ను చెల్లింపుదారుల ఎలాంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది? రిటర్నుల దాఖలులో పొరపాటు జరిగితే ఏమవుతోంది? విధిగా పన్ను కట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి?
- రెండో టీ20.. ఇంగ్లాండ్‌తో అమీతుమి.. సిరీస్‌పై కన్నేసిన భారత్
ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌కు సన్నద్ధమైంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న రెండో టీ20లో గెలిచి.. సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సిరీస్ గెలుచుకొని.. టెస్టులో జరిగిన పరాజయానికి టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?.
- ఆసుపత్రిలో చేరిన హీరో విక్రమ్
ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందని వార్తలు రాగా.. అలాంటిదేమీ లేదని సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఇంతకీ ఏమైంది? కావేరి ఆస్పత్రి వైద్యుల మాటేంటి?.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - today ap news
.
9pm Top news of ap