- ఉల్లంఘనపై కొరడా
లీజు నిబంధనలను ఉల్లంఘించారంటూ ఓ హోటల్ స్థలాన్ని విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఆదివారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకొంది. విశాఖ సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ లీజుకు ఇచ్చిన స్థలంలో ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని నిర్వహిస్తున్న హోటల్‌ను అధికారులు ఆదివారం ఖాళీ చేయించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తిరుచానూరుకి శ్రీవారి లక్ష్మీకాసుల హారం
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల కోసం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీకాసుల హారాన్ని ఆలయ అర్చకులు తీసుకువెళ్లారు. ఈ రోజు రాత్రి నిర్వహించే గజవాహన సేవలో పద్మావతి అమ్మవారికి... శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కిరాతకం
లారీ క్లీనర్‌ను డ్రైవర్ ఇనుపరాడ్డుతో కొట్టి, కత్తితో పొడిచి అతికిరాతకంగా చంపిన ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వీరిద్దరూ ఏపీలోని కాకినాడకు చెందినవారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నితీశ్ ఏకగ్రీవం
బిహార్ ఎన్డీఏ కూటమి శాసనసభాపక్షనేతగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. నితీశ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్డీఏ పక్షాలు ఆయనను కూటమి నాయకుడిగా ఎన్నుకున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దురాగతం
మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన కర్ణాటకలో జరిగింది. కన్న తల్లినే హత్యాచారం చేశాడు ఓ కర్కశ కొడుకు. ఈ నెల 12 జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆహా! అనిపించే 'ఆవిరిపై చేపలకూర'
మాయదారి కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ తెగ జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందులో ఎక్కువగా ఆవిరి పట్టడం అలవాటుగా మారిపోయింది. అయితే అదే ఆవిరితో మాం..చి చేపల కూర కూడా చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అంతుచిక్కని రహస్యం!
ఏ హోటల్లో అయినా సిబ్బందికి తప్ప సామాన్య ప్రజలకు అనుమతి లేని కొన్ని గదులుంటాయి. అంతే గానీ పూర్తిగా అంతస్తులోకే అనుమతి లేకుండా ఉండవు. కానీ ఉత్తర కొరియాలోని ఓ హోటల్లోని ఐదో అంతస్తులోకి ఎవరినీ అనుమతించరు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రిలయన్స్ చేతికి అర్బన్ ల్యాడర్!
ఓ వైపు వరుసగా పెట్టుబడులను రాబడుతూనే.. మరోవైపు వేగంగా విస్తరణకు అడుగులేస్తోంది రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్. తాజాగా ఈ సంస్థ అర్బన్ ల్యాడర్ హోమ్ డెకార్స్ సొల్యూషన్స్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.182.12 కోట్లు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఖర్చెంతో తెలుసా?
ఐపీఎల్-2020 ఆతిథ్యం కోసం ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ రూ.100కోట్లపైనే చెల్లించిందని తెలిసింది. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్త సంస్థ స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అందానికి అర్థం
అందాల ముద్దుగుమ్మగా యువత మనసు కొల్లగొట్టేసిన నటి అనుపమ పరమేశ్వరన్. అలాంటి అమ్మడు మాత్రం అందమంటే మనసు ప్రశాంతంగా ఉండటం అని చెప్పింది. ప్రస్తుతం హీరో నిఖిల్ సరసన '18పేజీస్' సినిమాలో నటిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.