ETV Bharat / city

అరెస్ట్​లకు నిరసనగా పలు జిల్లాల్లో తెదేపా శ్రేణుల ఆందోళన - tdp leaders news in ap

రాష్ట్రవ్యాప్తంగా తెదేపానేతల అరెస్ట్​లకు నిరసనగా... పలు జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా నాయకులు ఆరోపించారు.

Tdp Leaders comments on ycp
తెదేపా నేతలు
author img

By

Published : Jun 19, 2020, 4:08 PM IST

తెదేపా నాయకుల అరెస్ట్​లకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

  • ప్రశాంతమైన జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయం..

ప్రశాంతతకు మారు పేరైన పశ్చిమగోదావరిజిల్లాలో పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయ విష సంస్కృతి ప్రవేశపెడుతున్నారని.. తెదేపా జిల్లా నాయకులు ఆరోపించారు. లొంగని తెదేపా నాయకులను కేసుల పేరుతో వేధిస్తున్నారని మాజీ జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మండిపడ్డారు. ఇప్పటికే జిల్లాలో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి... మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

  • ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలి...

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చిన శంకర్ల పూడి గ్రామానికి చెందిన తెదేపా బీసీ నాయకుడు ఏపూరి శ్రీనివాస్ బెయిల్ పై విడుదలయ్యాడు. ఎస్ఐ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగం పై పది రోజులు కిందట పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఎస్ఐ రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని .... శ్రీనివాస్​కి మద్దతుగా చిన్నశంకర్లపూడిలో గ్రామస్థులు, తెదేపా శ్రేణులు రోడ్డు పై బైఠాయించి... నినాదాలు చేశారు.

నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో శ్రీనివాస్​కి సంఘీభావంగా పెద్ద సంఖ్యలో తెదేపా శ్రేణులు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నాయి. బీసీలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని... మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని రాజా ఆరోపించారు. ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • బీసీ నాయకుల పై దాడిని ఖండించిన తెదేపా

శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్​పై దాడిని, బీసీ నాయకులు కింజరపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్ట్​లను విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గంలోని తెదేపా శ్రేణులు తీవ్రంగా ఖండించాయి.

ఇవీ చదవండి: అచ్చెన్నాయుడు కేసు: కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.