ETV Bharat / city

మైనింగ్‌ అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు: హైకోర్టు - అక్రమ మైనింగ్​పై హైకోర్టు ఆగ్రహం

మైనింగ్‌ అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని హైకోర్టు హెచ్చరించింది. ఏలూరు జిల్లా తోటపల్లి పరిధిలో తవ్వకాలు నిలిపేయాలని ఆదేశించాక మైనింగ్‌ జరిగిందో, లేదో తేలుస్తామని స్పష్టంచేసింది. ఈ వ్యవహారంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వ్యాజ్యం ఉపసంహరించుకోవాలని న్యాయవాదికి బెదిరింపు కాల్స్ రావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఉందా అని నిలదీసింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది.

ap high court
ఏపీ హైకోర్టు
author img

By

Published : Oct 13, 2022, 7:21 AM IST

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామ పరిధి ఆర్​ఎస్​ నెంబర్ 2/1లో 8.50ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు బి.బసవపూర్ణయ్య అనే వ్యక్తికి గనులశాఖ ఇచ్చిన తాత్కాలిక అనుమతులను సవాలు చేస్తూ.. జె.లక్ష్మణరావు సహా మరో ఐదుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పరిధి దాటి విచక్షణారహితంగా గ్రావెల్‌ తవ్వకాలు చేస్తున్నారని.. దీనివల్ల సమీపంలోని తమ భూములు, పత్తి పంట ధ్వంసం అవుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్‌ జడ్జి విచారణ జరిపి, మైనింగ్‌ నిలిపివేయాలని ఆదేశించారు.

కొన్నిరోజుల తర్వాత ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన మరో సింగిల్‌ జడ్జి.. గత ఉత్తర్వులను సవరించారు. మైనింగ్‌కు అనుమతి ఇవ్వగా.. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు రైతులు అప్పీల్‌ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి.. మైనింగ్‌కు అనుమతి ఇస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసింది. మైనింగ్‌ కార్యకలాపాలు చేపట్టవద్దని స్పష్టంచేసింది. అయినా తవ్వకాలు జరుగుతున్నాయని, పిటిషనర్లపై తప్పుడు కేసు నమోదు చేశారని.. గత విచారణలో న్యాయవాది పాలేటి మహేశ్వరరావు హైకోర్టు దృష్టికి తెచ్చారు.

అప్పట్లో దీనిపై స్పందించిన ధర్మాసనం.. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాలని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తోటపల్లి గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్‌ను నిలిపేయించాలని నిర్దేశించింది. మైనింగ్‌ అక్రమాలను అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కేసు డైరీ, ఎఫ్​ఐఆర్​తో హాజరుకావాలని ఆగిరిపల్లి ఎస్సైని గతంలో ఆదేశించింది. ఈమేరకు బుధవారం మరోమారు విచారణ జరిపింది.

మైనింగ్‌ కార్యకలాపాలు నిలిపేయాలని సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ఆగస్టు 25వ తేదీనే.. పిటిషనర్లపై ఆగిరిపల్లి ఠాణాలో కేసు నమోదు చేయడం పట్ల ఎస్సైపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ఉత్తర్వులను తొక్కిపట్టి, మైనింగ్‌కు పాల్పడుతున్న వారికి అండగా నిలిచేందుకే.. పేదలైన పిటిషనర్లపై కేసు నమోదు చేసినట్లుందని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు దూరంగా ఉండాలని, లేకుంటే ఇబ్బందులు పాలవుతారని కోర్టుకు హాజరైన ఆగిరిపల్లి ఎస్సైని హెచ్చరించింది. పద్ధతి మార్చుకోకపోతే అరెస్ట్‌ చేయాలని ఎస్పీని ఆదేశిస్తామని, యూనిఫాం ఎలా తీయించాలో తెలుసునని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. అంతిమంగా ఈ వ్యవహారంపై విచారణ కొనసాగించాలని సింగిల్‌ జడ్జికి సూచించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.