ఏలూరు తివాచీ విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఒకప్పుడు ఎగుమతులూ విరివిగా సాగేవి. నెలకు సగటున 50 వేల వరకూ దేశవిదేశాలకు పంపేవారు. ఊలుతో తయారు చేసే ఇక్కడి తివాచీలు 6 వేల నుంచి 20 వేల వరకూ ధర పలుకుతాయి. ఒక్కో తివాచీకి 3 వేల రూపాయల వరకూ మిగిలేది. దానితోనే కుటుంబపోషణ సాగేది. జిల్లాలో వేల కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. కరోనా దెబ్బకు ఎగుమతుల్లేక తయారీదారులు డీలాపడ్డారు. కార్మికులూ చేతిలో పని లేక అవస్థలు పడుతున్నారు.
చేనేత హస్తకళల గుర్తింపు కార్డులున్నా... ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందట్లేదని తయారీదారులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి : భీమవరంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రికి తాళం