పశ్చిమగోదావరి జిల్లాలో కొవిడ్ ఉద్ధృతంగా విస్తరిస్తోంది. జిల్లాలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. జిల్లాలోని కవిటి ఆస్పత్రిలో కరోనా బాధితులు పడకల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు ఆస్పత్రిలో పడకల కొరతతో రోగులకు ఆరుబయటే ఆక్సిజన్ అందించారు. కొంత మందిని ఇతర ఆసుపత్రులకు పంపారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం.. వారికి త్వరగా నయం కాకపోవడంతో డిశ్ఛార్జ్ అయ్యే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ కారణంగా జిల్లా ఆస్పత్రిలో పడకల కొరత ఏర్పడుతోంది. మొత్తం 300 పడకలు ఉండగా.. అన్నీ నిండి పోయాయి.
ఇదీచదవండి.