3 రాజధానుల శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడిందని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతి రైతులు, మహిళలు ఆందోళన చెందవద్దన్నారు. న్యాయం మీ పక్షాన ఉందని.. గాంధేయ మార్గంలో ఆందోళన చెయ్యండి తప్ప.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాజధానిపై కేంద్రానికి సంబంధం లేదనడం అసంబద్ధ వాదన అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా 3 రాజధానులపై పునరాలోచన చేయాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి..