అమరావతి రైతులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పిందని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సీఆర్‌డీఏలో ఆర్-5 జోన్‌పై హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించిందన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో భూములు ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. భూముల కొనుగోలులో అవకతవకలపై అనిశా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దోషులపై విచారణ జరిపించి సీఎం చర్య తీసుకుంటారని ఆశిస్తున్నానని ఎంపీ అన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జి.దేవేందర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినా సీఎం చర్యలు తీసుకోలేదన్నారు.
"న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురవుతున్నాయి. సీఎం చుట్టూ ఉన్నవారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పార్క్ హయత్‌లో ఏదో జరిగిందంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేందుకు నిదర్శనం"--- రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
ఇదీ చదవండి : 'రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాస్తున్నారు'