ETV Bharat / city

కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశం కాదు: ఎమ్మెల్యే భూమన - భూమన కరుణాకర్ రెడ్డి

వరవరరావు విషయంలో భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దియోధర్‌ వ్యాఖ్యలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. వరవరరావుపై జాలి చూపమని కోరానని...అది తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు.

Ycp MLA Bhumana Karunakar Reddy
Ycp MLA Bhumana Karunakar Reddy
author img

By

Published : Aug 30, 2020, 3:37 PM IST

వరవరరావు విషయంలో భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దియోధర్‌ వ్యాఖ్యలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం తన ఉద్దేశం కాదన్న భూమన.. 81 ఏళ్ల వరవరరావుపై జాలి చూపమనే కోరానని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితం ఆర్ఎస్ఎస్​తోనే ప్రారంభమైందని... వెంకయ్యనాయుడు, వరవరరావుతో కలిసి జైలులో ఉన్నానని గుర్తు చేశారు. అందుకే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశానని వివరణ ఇచ్చారు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని సీఎంతో ముడిపెట్టడం బాధించిందని భూమన అన్నారు.

సునీల్ దియోధర్ ట్వీట్

  • జగన్ రెడ్డి గారూ
    దేశ ప్రధానమంత్రిని హతమార్చాలనే కుట్ర పన్ని అరెస్టయిన విరసం నేత వరవరరావును విడుదల చెయ్యాలని కోరిన భూమన కరుణాకరరెడ్డిని ఇంకా సస్పెండ్ చేయలేదంటే ఈ లేఖ మీ అనుమతితోనే వెళ్ళిందనుకోవాలా?
    తక్షణమే MLA పై చర్యలు తీసుకోని ప్రజలకు క్షమాపణ చెప్పాలి#MaoistAgainstConstitution pic.twitter.com/0syhvtvUdY

    — Sunil Deodhar (@Sunil_Deodhar) August 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

వరవరరావును విడుదల చేయించాలి: ఉపరాష్ట్రపతికి భూమన లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.