ETV Bharat / city

సాధారణ ఎన్నికల కంటే వైకాపాకు పెరిగిన ఓట్ల శాతం ఎంతంటే.. - ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2021

నగర, పురపాలిక ఎన్నికల్లో అధికార వైకాపా 50 శాతానికి మించి ఓట్లను దక్కించుకుంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటింగ్‌ శాతం పెరిగింది. తెలుగుదేశం పార్టీ మాత్రం భారీగా ఓట్ల శాతాన్ని కోల్పోయింది. చాలా రాజకీయ పార్టీలు కనీసం ఒక్క శాతం ఓట్లను కూడా దక్కించుకోలేకపోయాయి.

ap muncipal elections 2021
ap muncipal elections 2021
author img

By

Published : Mar 15, 2021, 7:37 PM IST

రాష్ట్రంలో జరిగిన 2019 సాధారణ ఎన్నికల తరహాలోనే పురపాలిక ఎన్నికల్లోనూ వైకాపా ఓట్ల శాతాన్ని కొల్లగొట్టింది. పోల్ అయిన ఓట్లలో 52.63 శాతాన్ని సొంతం చేసుకుంది. సాధారణ ఎన్నికలలో 49.95 శాతం ఓట్లు సాధిస్తే.. పుర, నగర పాలిక ఎన్నికల్లో ఓట్ల వాటా గణనీయంగా పెరిగింది. కార్పొరేషన్లలోని 532 డివిజన్లల్లో 427 చోట్ల ఫ్యాన్‌ గాలి వీచింది. మున్సిపాలిటీల్లోని 2,123 వార్డుల్లో ఏకగ్రీవం కాగా.. ఎన్నికలు జరిగిన 1632 వార్డుల్లో 1289 వార్డులను అధికార పార్టీ సొంతం చేసుకుంది. నగరపాలికల్లో 13,19,466 ఓట్లు.. మున్సిపాలిటీల్లో 11 లక్షల 78 వేల 275 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 24,97,741 ఓట్లతో..52.63 శాతం మేర ఓట్లను కైవసం చేసుకుంది.

డీలా పడిన తెదేపా..

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. మరింత డీలా పడింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలైన ఓట్ల శాతంతో పోలిస్తే..భారీగా ఓట్లను కోల్పోయింది. పుర, నగర పాలికల్లో తనకున్న ఓట్లను దక్కించుకోలేకపోయింది. తెలుగుదేశం పార్టీకి కార్పొరేషన్లలో 8లక్షల 35 వేల ఓట్లు, పురపాలికల్లో 6 లక్షల 22 వేలు ఓట్లు మాత్రమే వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి పడిన ఓట్లు మొత్తంగా 14,58,346గా తేలింది. తెలుగుదేశం పార్టీ 30.73 శాతం ఓట్లను దక్కించుకుంది. కార్పొరేషన్లు, పురపాలికలు రెండిటిలోనూ కలిపి 349 వార్డులను మాత్రమే తెదేపా గెలుపొందింది.

తేలిపోయిన భాజపా- జనసేన...

ఇక భాజపా, జనసేన ప్రభావం నామమాత్రమేనని తేలిపోయింది. జనసేన 2,21,705 ఓట్లతో 4.67 శాతం ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. భాజపాకు సాధారణ ఎన్నికల కంటే స్వల్పంగా ఓట్ల వాటా పెరిగింది. ఆ పార్టీకీ అన్ని నగర, పురపాలికల్లో కలిపి లక్షా 14 వేల ఓట్లు పోలయ్యాయి. 2.41శాతం ఓట్లు భాజపాకు వచ్చాయి. ఇక సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. పురపాలికలు, నగర పాలికల్లో 50,595 మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. మొత్తంగా 1.07 శాతం ఓట్లు నోటాకే వెళ్లాయి. ఇదే సమయంలో సీపీఐకి 0.80 శాతం, సీపీయంకు 0.81 శాతం, కాంగ్రెస్ పార్టీకి 0.62 శాతం ఓట్లు దక్కాయి. ఇండిపెండెంట్లు 5.73 శాతం ఓట్లను కైవసం చేసుకోగలిగారు.

ఇదీ చదవండి

మేయర్లు, ఛైర్మన్ల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు.. పరిశీలనలో పలువురి పేర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.