గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వైకాపా బహిష్కృత నేత సందీప్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అక్రమ సంపాదన కోసం ఎమ్మెల్యే ఆశ పడ్డారని.. అందుకే అడ్డదారులను తొక్కేందుకు చూశారని విమర్శించారు. పేకాట నిర్వహిస్తూ తాను దొరికానని చెప్పటం అవాస్తమన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీదేవి తనతో ఫోన్లో మాట్లాడిన ఓ ఆడియో టేపును సందీప్ విడుదల చేశారు. ఇందులో పేకాట నిర్వహణకు సంబంధించిన సంభాషణ జరిగినట్లు ఉంది.
సందీప్ ఏం చెప్పాడంటే...
'ఉండవల్లి శ్రీదేవి అక్క పేకాటకు మీకు సంబంధం లేదని.... పేకాట నేనే ఆడించారని చెప్పారు. పేకాట ఆడిద్దామని నాతో మాట్లాడిన మాటలు వాస్తవం కాదా..? మీరు నాకు ఫోన్ చేసినప్పుడు పేకాట వద్దు మేడం... ఇది అక్రమ కార్యకలాపాల కింద వస్తుందని చెప్పాను. వాళ్లు అడిస్తున్నారు.. వీళ్లు అడిస్తున్నారని..దాంతో డబ్బులు వస్తాయని చెప్పారు. అక్రమదారులు తొక్కి జగనన్న ఆశయాలను పక్కనబెట్టిన మాట వాస్తవం కాదా...? మేం జగనన్న ఆశయాల కోసం పని చేస్తుంటే.. మమ్మల్ని కూడా పక్కదోవ పట్టించాలని చూశారు. మీరు నాతో పేకాట గురించి ఫోన్లో మాట్లాడిన మాటలు వాస్తమని చెప్పి నా బిడ్డల సాక్షిగా ప్రమాణం చేస్తాను. నిజం కాదని మీ ముగ్గురు బిడ్డలపై ప్రమాణం చేయండి. ఇప్పటికైనా మీరు మారి జగనన్న ఆశయాల కోసం, రాజన్న రాజ్యం కోసం కష్టపడాలని మనవి చేస్తూ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను అక్కా.' -సందీప్, వైకాపా బహిష్కృత నేత(తాడికొండ నియోజకవర్గం)
ఇదీ చదవండి
'ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉంది.... బోరుమన్న వైకాపా బహిష్కృత నేత'