ETV Bharat / city

హైకోర్టు ఆదేశాలు మరిచారు.. 'పంచాయతీ'కి పార్టీ రంగులేశారు! - ycp colors painted to govt offices news

ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలకు వేసిన రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా.. నేతల తీరు మారలేదు. తాజాగా.. గుంటూరు జిల్లాలోని లేమల్లెపాడు పంచాయతీ భవనానికి వైకాపా రంగులు వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ycp colors painted to the  panchayathi office

author img

By

Published : Apr 22, 2020, 10:23 AM IST

పంచాయతీ ఆఫీసుకు వైకాపా రంగులు

పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు ఇప్పటికే తీవ్రంగా తప్పుబట్టింది. అయినా... గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు పంచాయతీ భవనానికి వైకాపా రంగులు వేశారు. ఇప్పటివరకూ ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ రంగులను తొలగించి.... కొత్త రంగులు వేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అందుకు సమ్మతించిన ప్రభుత్వం.... 4 వారాల గడువు కోరింది. ధర్మాసనం 3 వారాల గడువిచ్చి... రంగులు మార్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అంతలోనే మరో కార్యాలయానికి వైకాపా రంగులు పూయడం చర్చనీయాంశమైంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:

గుప్పెడు మెతుకుల కోసం.. పేదల నిరీక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.