AP Local body MLC Results: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. 11 మంది వైకాపా అభ్యర్థులు విజయం సాధించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 8 జిల్లాల్లోని స్థానిక సంస్థల నుంచి.. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో పేర్కొంది.
Local body MLC Election Results: అనంతపురం నుంచి యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్, మొండితోక అరుణ్ కుమార్ ఎన్నికైనట్టు తెలిపింది. తూర్పుగోదావరి నుంచి అనంత సత్య ఉదయ భాస్కర్, గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు ఏకగ్రీవం అయ్యారు.
విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖ నుంచి వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు ఎన్నికైనట్టు ఈసీ తెలిపింది. చిత్తూరు నుంచి కృష్ణరాఘవ జయేంద్ర భరత్, ప్రకాశం నుంచి తూమటి మాధవరావు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇదీ చదవండి