సీఎం జగన్ తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడేందుకే దిల్లీ వెళ్లారని మాజీ మంత్రి యనమల ఆరోపించారు. అందుకే...కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. దిల్లీలో జగన్ కు ఇది రెండో పరాభవమని ఎద్దేవా చేశారు. ఎప్పుడు అక్కడికి వెళ్లినా సొంత కేసులు, డిశ్చార్జ్ పిటిషన్లు, కోర్టు హాజరు మినహాయింపుల గురించే అడుగుతున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ కూరుకుపోయారని యనమల ఆరోపించారు. ట్రయల్స్ వేగవంతం అవుతున్న కారణంగా... శిక్షపడే సమయం దగ్గర పడిందని జగన్ కు భయం పట్టుకుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి శుక్రవారం ఏదో పర్యటన పెట్టుకునేది కోర్టు వాయిదా ఎగ్గొట్టేందుకేనని ఆరోపించారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా వైఫల్యాలను ఎండగడతామని యమనల స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: