ETV Bharat / city

యాదాద్రి భక్తులకు ఊరట.. పార్కింగ్​ అదనపు రుసుము ఎత్తివేత - yadadri parking fee details

పార్కింగ్ ఫీజు నిబంధనల్లో తెలంగాణలోని యాదగిరిగుట్ట దేవస్థానం మార్పులు చేసింది. పార్కింగ్​ చేసిన తర్వాత అదనపు గంటకు నిర్ణయించిన రూ.100 రుసుము ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు. కొండపైకి వెళ్లే 4 చక్రాల వాహనాల పార్కింగ్ ఫీజు రూ.500 యథాతథంగా ఉంచారు.

యాదాద్రి
యాదాద్రి
author img

By

Published : May 4, 2022, 8:20 PM IST

పార్కింగ్ ఫీజు విషయంలో తెలంగాణలోని యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీ వెనక్కి తగ్గింది. పార్కింగ్ ఫీజు నిబంధనల్లో అధికారులు మార్పులు చేశారు. పార్కింగ్​కు అదనపు గంటగా నిర్ణయించిన రూ.100 అదనపు రుసుము ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు. కొండపైకి వెళ్లే 4 చక్రాల వాహనాల పార్కింగ్ ఫీజు రూ.500 యథాతథంగా నిర్ణయించారు. దీనితో యాదాద్రి భక్తులకు కాస్త ఊరట కలగనుంది.

యాదాద్రి కొండపైకి ఆదివారం (మే1) నుంచి భక్తుల వాహనాలను అనుమతించాలని యాదాద్రి ఆలయ అధికారులు నిర్ణయించారు. అయితే.. కొండపైకి అనుమతించే వాహనాలకు పార్కింగ్‌ రుసుము వసూల్ చేస్తున్నారు. కొండపైకి వచ్చే వాహనాలకు గంటకు రూ.500 రుసుం విధించారు. గంట సమయం తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు భక్తుల ఆగ్రహం మేరకు దేవస్థానం కమిటీ వెనక్కి తగ్గింది. అదనపు రుసుము ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇదీ చూడండి: యాదాద్రి కొండపైకి వాహనాల అనుమతి.. పార్కింగ్ ఫీజు గంటకు రూ. 500

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.