ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ సంబరాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా చేసుకున్నారు. పలుచోట్ల మహిళలు ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. న్యాయవాదులు అతివలకు చట్టాలపై అవగాహన కల్పించారు. వివిధ చోట్ల జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు.. చిన్నారుల ప్రదర్శనలు అలరించాయి.

womens-day-celebrations-in-ananthapuram-kadapa-kurnool-nellore-visakhapatnam-vizianagaram-srikakulam-east-godavari-krishna-discricts

author img

By

Published : Mar 9, 2020, 4:39 PM IST

వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కడప పోలీస్​ స్టేషన్​లో, రాజంపేట బీసీ బాలికల సమీకృత వసతి గృహంలో, రాయచోటిలో చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు.

తూర్పుగోదావరిలో..

తూర్పుగోదావరి జిల్లా తుని లయోల విద్యాసంస్థల్లో మహిళా దినోత్సవ సంబరాలు వైభవంగా జరిగాయి. దేశానికి విశేష సేవలందించిన ధీర వనితలు, వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన మహిళల వేషధారణలతో చిన్నారులు అలరించారు.

విశాఖలో..

విశాఖ జిల్లా చోడవరంలో మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేశారు. ముంచంగిపుట్టులోని గిరిజన బాలిక పాఠశాల విద్యార్థులతో 2కె రన్ నిర్వహించారు. ఎలమంచిలి పట్టణంలో మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

ఉత్తరాంధ్రలో ఘనంగా

శ్రీకాకుళం జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. టెక్కలిలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. అలాగే విజయనగరం జిల్లా పార్వతీపురంలోనూ మహిళలు ర్యాలీగా వెళ్లారు.

ప్రకాశం జిల్లాలో

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చేసిన గిరిజన సంప్రదాయ నృత్యాలు అందరినీ అలరించాయి.

నెల్లూరులో

నెల్లూరు నగరంలోని వీపీఆర్ కల్యాణమండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి ఉషమ్మ, కుమార్తె దీపా వెంకట్, తితిదే పాలక మండలి సభ్యురాలు ప్రశాంత్ రెడ్డి, సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ పాల్గొన్నారు. మహిళలు ప్రతి రంగంలోనూ ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఉషమ్మ ఆకాంక్షించారు.

కర్నూలు జిల్లాలో

కర్నూలు జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణిస్తోన్న మహిళలను కళాసౌరభ ఆధ్వర్యంలో సన్మానించారు. డోన్ ఐసీడీఎస్​ కార్యాలయంలో అంగన్వాడీ సిబ్బందికి ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని తెదేపా కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు.

ఇదీ చదవండి:

రామోజీ ఫిల్మ్​ సిటీలో మహిళా దినోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.