తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళ ట్రైనీ ఎస్సై(TRAINEE WOMAN SI) లైంగిక వేధింపుల(SEXUAL HARASSMENT) ఆరోపణలు కలకలం రేపాయి. జిల్లాలోని మరిపెడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తనపై అత్యాచారాయత్నం (SI RAPE ATTEMPT)చేశారంటూ మహిళా శిక్షణ ఎస్సై వరంగల్ పోలీస్ కమిషనర్(CP)కు ఫిర్యాదు చేశారు.
తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు సీపీని కోరారు. సోమవారం రాత్రి అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారంటూ ట్రైనీ ఎస్సై ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:
viveka murder case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సునీల్ యాదవ్ అరెస్ట్