రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని(SEC Neleam sahni)ని నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని.. పిటిషనర్ మూర్తి ఉపసంహరించుకున్నారు. దీంతో పిటిషన్ను డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. పూర్తిస్థాయిలో పత్రాలు లేనందున వ్యాజ్యాన్ని ఉపసహరించుకుంటున్నానని.. పూర్తి స్థాయి పత్రాలతో మరోసారి పిటిషన్ దాఖలుకు అనుమతివ్వాలని హైకోర్టును కోరారు. అందుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది.
ఇదీ చదవండి: AP EXAMS: పరీక్షల సమయంలో మూడో వేవ్ వస్తే.. ఏం చేస్తారు?: సుప్రీంకోర్టు