ETV Bharat / city

KCR ON WATER DISPUTES: 'స్వయం పాలనలో సాగునీటి కష్టాలు రానివ్వం' - TELUGU STATES WATER WAR

కృష్ణా నీటి పంపకాలపై తెలంగాణ హక్కుగా రావాల్సిన వాటా కోసం రానున్న పార్లమెంట్​ సమావేశాల్లో తమ వాణి బలంగా వినిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరి.. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని మండిపడ్డారు.

KCR ON WATER DISPUTES
KCR ON WATER DISPUTES
author img

By

Published : Jul 7, 2021, 7:18 AM IST

'స్వయం పాలనలో సాగునీటి కష్టాలు రానివ్వం'

కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని వేదికల మీద రాజీ లేని పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు. ట్రైబ్యునల్స్, కృష్ణాబోర్డు, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనూ తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం తీర్మానించింది.

వ్యూహాల ఖరారు కోసం..

నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందేలా భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్​లో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, అడ్వొకేట్ జనరల్ పాల్గొన్నారు.

అధికారులకు మార్గనిర్దేశం..

ఆరు గంటలకు పైగా జరిగిన సమీక్షా సమావేశంలో.. తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న సాగునీటి వివక్ష గురించి లోతుగా చర్చించారు. స్వయం పాలనలో రైతులకు సాగునీటి కష్టాలు ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సమావేశం తీర్మానించింది. రాష్ట్రం తరఫున అనుసరించాల్సిన వ్యూహం, ఎత్తుగడలపై భేటీలో చర్చించారు. అందుకు అనుగుణంగా అధికారులు, ఇంజినీర్లకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు.

ఇదీచూడండి: CM KCR: 'పోతిరెడ్డిపాడును అంగీకరించం.. రాయలసీమ ఎత్తిపోతలా అక్రమమే'

రాజీలేని పోరాటం..

కృష్ణా నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి.. తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉందని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని వేదికలపైనా రాజీలేని పోరాటం చేస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. నదీజలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను రాబట్టుకోవడం సహా రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలను నడిపించుకొనేందుకు జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

ఇవీచూడండి: CM KCR: 'కష్టపడి నీళ్లు తెచ్చిపెట్టిన... వినియోగించుకునే బాధ్యత మీదే'

తెలంగాణ వాణి..

తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను నిర్ధరించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రైబ్యునల్స్​, కృష్ణాబోర్డు, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంటు సమావేశాల్లోనూ తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.