అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రమేష్ పొక్రియల్ నిశాంక్, స్మృతిఇరానీ, సంజయ్ దొత్రే, ప్రకాష్ జావడేవకర్, గోవా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశానికి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ హాజరయ్యారు. 12వ తరగతి పరీక్షలు, వివిధ ఎంట్రెన్స్‌ల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి ఈ విద్యా సంవత్సరం నుంచే ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్ఈ విధానం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి సురేశ్ తెలిపారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రోటోకాల్ పాటిస్తూ... అన్ని పరీక్షా కేంద్రాల్లో శానిటేషన్ చేస్తూ ప్రతిచోట ఒక ఐసోలేషన్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఉపాధ్యాయులకు శిక్షణ, ఆన్లైన్ టీచింగ్, సిలబస్ తగ్గించి సకాలంలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షలు నిర్వహించే ముందే ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు వ్యాక్సిన్ వేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది: ఏకే సింఘాల్