తెలంగాణ హైదరాబాద్ లోని సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతాన్ని వరంగల్ సీపీ తరుణ్ జోషి పరిశీలించారు. ఇవాళ ఉదయం 8:45 గం.కు మృతదేహాన్ని రైల్వే కార్మికులు గుర్తించారని ఆయన వెల్లడించారు. మొదట రైల్వే ఉన్నతాధికారులకు కార్మికులు సమాచారం ఇచ్చారని.. అనంతరం డయల్ 100 ద్వారా తమకు సమాచారం అందించారని సీపీ వివరించారు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. రాజు స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఎలా వచ్చాడో దర్యాప్తు చేస్తామన్నారు.
ఉ.8.45 గంటలకు మృతదేహాన్ని రైల్వే కార్మికులు గుర్తించారు. మొదట రైల్వే ఉన్నతాధికారులకు కార్మికులు సమాచారం ఇచ్చారు. డయల్ 100 ద్వారా మాకు సమాచారం ఇచ్చారు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నాం. రాజు స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఎలా వచ్చాడో దర్యాప్తు చేస్తాం. - తరుణ్ జోషి, వరంగల్ సీపీ .
ఇదీ చదవండి: Saidabad Incident: రైల్వేట్రాక్‌పై సైదాబాద్ హత్యాచార నిందితుడి మృతదేహం