విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటనను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలకు వెంటనే తగిన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. దేవాలయాల పరిరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతున్నట్లు కనిపిస్తోందని విమర్శించింది. ఈ మేరకు వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి మిలింద్ పాండే ఓ ప్రకటన విడుదల చేశారు.
గత రెండు రోజుల్లో ఏపీలోని మూడు ఆలయాలపై దాడులు జరిగాయని.. జగన్ ప్రభుత్వం ఉదాసీనతతోనే హిందూ దేవాలయాలపై దాడులు పునరావృతం అవుతున్నాయని వీహెచ్‌పీ ఆరోపించింది. దాడులకు పాల్పడిన వారిపై ఇప్పటివరకు ఎటువంటి శిక్షా లేదని ఆక్షేపించింది. దురాగతాలకు వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునివ్వడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని పేర్కొంది. నిందితులపై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి
రామతీర్థం ఘటన నిందితులను మూడురోజుల్లో పట్టుకుంటాం: వెల్లంపల్లి