ETV Bharat / city

Travel to America : అమెరికా వెళ్తున్నారా.. అయితే ఆ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి - అమెరికా ప్రయాణించడానికి టీకా ధృవీకరణ అవసరం

మీరు అమెరికా వెళ్తున్నారా... పాస్​పోర్ట్​, వీసాతో పాటు... ఇంకో ధ్రువీకరణ పత్రం (Vaccine certificate) ఉండాల్సిందే. తమ దేశానికి (America) వచ్చే విదేశీయులకు తప్పనిసరిగా కరోనా టీకా రెండు డోసులు (corona second dose) తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేసింది అమెరికా. ఆ సర్టిఫికెట్​ను కొవిన్‌ పోర్టల్‌లో తీసుకోవచ్చు.

Travel to America
అమెరికా వెళ్తున్నారా
author img

By

Published : Oct 28, 2021, 11:10 AM IST

తమ దేశానికి వచ్చే విదేశీయులకు తప్పనిసరిగా కరోనా టీకా (Corona vaccine) రెండు డోసులు తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఉండాలని అమెరికా (America) ప్రకటించింది. ప్రయాణానికి మూడు రోజుల ముందు తీసుకున్న ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష(rtpcr test) నెగిటివ్‌ రిపోర్టు కూడా ఉండాలని స్పష్టంచేసింది. చాలా దేశాలు ఇవే నిబంధనలు విధిస్తున్నాయి. మన దేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో.. ముఖ్యంగా ఉత్తరాదిలోని కొన్ని ప్రముఖ ఆలయాల సందర్శనకు ధ్రువీకరణ పత్రం చూపించాలి. లేదా కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రమైనా తప్పనిసరి. అయితే టీకా ధ్రువీకరణ పత్రాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి ఒకే డోసు తీసుకున్నట్లు పత్రం వస్తుంటే.. మరికొందరికి ఆ సమాచారమూ అందడం లేదు.

ఎందుకిలా?

కొందరు టీకా రెండు డోసులను వేర్వేరు కేంద్రాల్లో తీసుకున్నారు. టీకా తీసుకునేముందు కొవిన్‌ పోర్టల్‌లో (cowin portal) లేదా ఆరోగ్యసేతులో నమోదు చేసుకోవాలి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు భారీఎత్తున టీకాలు అందించే క్రమంలో సొంత వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశాయి. ఒక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇచ్చి, దాని ఆధారంగా టీకాలు ఇచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు సక్రమంగా నమోదు చేయలేదు. ఇలాంటి వారికి తొలి డోసు తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రాలు వస్తున్నాయి. నిమ్స్‌లో టీకా కార్యక్రమం ప్రారంభించే సమయంలో వైద్యులు, సిబ్బంది మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇలా చాలామంది టీకాలు తీసుకున్నారు. వారి పేర్లు ఆరోగ్యసేతు/కొవిన్‌ పోర్టల్‌లో నమోదు కాలేదు. రెండు డోసులు తీసుకున్నా ధ్రువపత్రం అందలేదు.

సర్టిఫికెట్‌ పొందండిలా..

కొవిన్‌ (cowin) లేదా ఆరోగ్యసేతు పోర్టల్‌(arogya sethu portal) లో నమోదు చేసిన మొబైల్‌ నంబర్‌తో ధ్రువీకరణ పత్రం పొందే అవకాశం ఉంది. లేదా కొవిన్‌ సహాయ కేంద్రం నంబర్‌ 9013151515కు వాట్సప్‌లో ‘సర్టిఫికేట్‌’ అని నమోదు చేయాలి. కొవిన్‌ పోర్టల్‌లో నమోదైన నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. రెండు డోసులు పూర్తయి ఉంటే.. పీడీఎఫ్‌ రూపంలో వాట్సప్‌కు సర్టిఫికేట్‌ వస్తుంది. లేదంటే ‘యూ ఆర్‌ నాట్‌ రిజిస్టర్డ్‌’ అనే సమాచారం పంపుతుంది. ధ్రువీకరణ పత్రం రానివారు వివరాల కోసం టీకా తీసుకున్న కేంద్రాల్లో సంప్రదిస్తే సాంకేతిక సమస్యలను గుర్తించి సరిదిద్దే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.