కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన బులెటిన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 23 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ప్రకటించింది. ఇవాళ 68 నమూనాలు పరీక్షించినట్టు తెలిపిన వైద్యశాఖ... అందులో 66 నెగెటివ్‌గా నిర్థరణ అయ్యాయని వెల్లడించింది. ఇప్పటి వరకు 584 నమూనాలను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 262 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజమహేంద్రవరంలో 72 ఏళ్ల వ్యక్తికి, కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి కరోనా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు నెల్లూరు, విశాఖల్లో కరోనా పాజిటివ్ వచ్చిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు.
కేసుల సంఖ్య ఇలా
జిల్లా | పాజిటివ్ కేసులు |
విశాఖ | 6 |
గుంటూరు | 4 |
కృష్ణా | 4 |
ప్రకాశం | 3 |
తూర్పుగోదావరి | 3 |
చిత్తూరు | 1 |
కర్నూలు | 1 |
నెల్లూరు | 1 |
వందమంది ఫలితాలు వెల్లడి కావాలి
రాష్ట్రంలో ఇప్పటివరకు 649 మందికి పరీక్షలు చేయగా.. 495 మందికి కరోనా నెగిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. విదేశాల నుంచి ఇప్పటివరకూ రాష్ట్రానికి 29,672 మంది ప్రయాణికులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 29,494 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన 178 మందికి ఆస్పత్రుల్లో వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇంకా వంద మంది నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని చెప్పారు.
ఇదీ చూడండి: