.
తుళ్లూరులో రైతుల పిల్లల ఒక రోజు నిరాహార దీక్ష - tulluru farmers protest news updates
రాజధాని ప్రజల ఆందోళనలు 30 వ రోజుకు చేరాయి. తుళ్లూరులో మహాధర్నా కొనసాగుతోంది. రైతుల పోరాటానికి సంఘీభావంగా వారి పిల్లలు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి ఇవాళ ఉదయం 11 వరకు దీక్ష కొనసాగింది. తమ తల్లిదండ్రులు నెల రోజుల నుంచి రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని యువతీ యువకులు ఆవేదన చెందారు. హైపవర్ కమిటీకి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలిపినా ప్రయోజనం ఉంటుందనే నమ్మకం లేదన్నారు.
tulluru-farmers-protest-news
.