తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ అమలు బాధ్యత ఎవరికి ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర రవాణా అథారిటీకి అధికారం అప్పగిస్తున్నట్టు కేబినెట్ తీర్మానంలో ఉందని పేర్కొంది. ప్రభుత్వం, అథారిటీ వేర్వేరు కదా అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పనిని అథారిటీ ఎలా చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రక్రియ నిర్వహిస్తారని ఏజీ వివరించారు. కేబినెట్ తీర్మానంలో అలా లేదని.. ప్రక్రియ నిర్వహించే అధికారం అథారిటీకి ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ నిర్వహణ అధికారం రాష్ట్ర రవాణా అథారిటీకి అప్పగించడాన్ని తప్పుబట్టిన హైకోర్టు... ప్రక్రియను రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి నిర్వహించాలని పేర్కొంది.
తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణపై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణపై తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్. విశ్వేశ్వరరావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేసుపై సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం... ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ జీవో రాక ముందు మంత్రివర్గ నిర్ణయాన్ని ఎలా సవాల్ చేస్తారంటూ కోర్టు దృష్టి తీసుకెళ్లారు. అందుకు సంబంధించి.. సుప్రీంకోర్టు తీర్పులను ఏజీ ప్రస్తావించారు.