ETV Bharat / city

ఏపీ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండండి: సీఎం కేసీఆర్

author img

By

Published : May 6, 2020, 11:58 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఏపీలోని కర్నూలు, గుంటూరు జిల్లాకు సరిహద్దుల్లోని గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ts-cm-kcr-review-on-lock-down-and-corona-effect-near-hyderabad

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్​డౌన్ అమలు, సహాయక చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ముఖ్యకార్యదర్శులు ఎస్.​నర్సింగ్​రావు, రామకృష్ణారావు పాల్గొన్నారు.

హైదరాబాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో మినహా తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉందన్న ముఖ్యమంత్రి... కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయన్నారు. హైదరాబాద్​పై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు నిర్వహించి.. అవసరమైతే చికిత్స చేయించాలని ఆదేశించారు. పాజిటివ్ అని నిర్ధరణ అయిన వ్యక్తి కాంటాక్టులు అందరిని క్వారంటైన్ చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్​లోని వారు బయటకు పోకుండా.. బయట వారు నగరంలోకి రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. చురుకైన ఐఏఎస్​లను ప్రత్యేకాధికారులుగా నియమించాలన్నారు. కర్నూలు పట్టణం, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువున్న దృష్ట్యా... అక్కడి సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించి చర్యలు చేపట్టాలన్నారు. అటువారెవరు ఇటు.. ఇటు వారెవరు అటు వెళ్లకుండా నియంత్రించాలని స్పష్టం చేశారు. వైరస్ మన దగ్గర పుట్టింది కాదని.. ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందిందే కాబట్టి ప్రజల రాకపోకలను కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇవీచూడండి: 'ఎక్కువ పరీక్షలు చేస్తున్నందుకే ఎక్కువ కేసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.