దిశ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిభవన్ వద్ద తృప్తి దేశాయ్, అనుచరులు ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిశ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళన చేస్తున్న తృప్తి దేశాయ్, అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గోషామహల్ పోలీస్ ష్టేషన్కు తరలించారు.
ఇవి కూడా చదవండి: