శాసన సభ్యత్వానికి ఈటల రాజేందర్ (Eatala rajender) రాజీనామా చేస్తే హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల మాదిరి వ్యూహం అనుసరించాలని తెరాస (Trs) అధిష్ఠానం నిర్ణయించింది. ఆదివారం నుంచే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష..
హుజూరాబాద్ (Huzurabad), వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్ మండలాలతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట పురపాలక సంఘాలుండగా వాటన్నింటికి మంత్రులను ఎన్నికల బాధ్యులుగా నియమించనున్నట్లు తెలిసింది. మేజర్ గ్రామపంచాయతీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఈటల రాజీనామా ప్రకటించిన తర్వాత.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (Ktr), మంత్రి హరీశ్‌రావు (Harish rao), ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తదితర ముఖ్యనేతలతో.. సీఎం కేసీఆర్ (Cm kcr) సమావేశం నిర్వహించారు.
సమాయత్తంకండి..
ఈ సందర్భంగా ఉప ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. తాజాగా ఈటల రాజీనామా నిర్ణయంతో ఉపఎన్నిక అనివార్యం కావడం వల్ల పూర్తిస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని సీఎం నిర్ణయించారు.
ఎన్నిక ఎప్పుడైనా..
శాసన సభ్యత్వానికి ఈటల రాజీనామా చేసిన అనంతరం దానిని సభాపతి ఆమోదించిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆరు నెలల్లోపు ఉపఎన్నిక జరగాలి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అన్ని ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేస్తోంది. ఎన్నికలు ఎప్పుడైనా ఇప్పటి నుంచే వ్యూహాన్ని అమలు చేయాలని తెరాస భావిస్తోంది.
ఇవీ చదవండి:
'త్వరలో కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు'
పోలవరం బిల్లులు వెనక్కి...ఎడమ కుడి కాలువలకు చెల్లింపులకు ఇక చెల్లు