ETV Bharat / city

రూ.450 కోట్ల టర్నోవర్ సాధించిన గిరిజన సహకార సంస్థ - AP GCC News

గిరిజన సహకార సంస్థ 450 కోట్ల రూపాయల మేర టర్నోవర్ సాధించిందని మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. పెద్ద మొత్తంలో మార్కెటింగ్ చేయడం ద్వారా ఈ టర్నోవర్​ను సాధించినట్టు వెల్లడించారు. గిరిజనులు సేకరించే చిన్నతరహా అటవీ ఉత్పత్తులను, వ్యవసాయ ఉత్పత్తులను జీసీసీ సేకరించి కనీస మద్ధతు ధరలు లభించేలా జీసీసీ ప్రయత్నిస్తోందన్నారు.

మంత్రి పుష్పశ్రీవాణి
మంత్రి పుష్పశ్రీవాణి
author img

By

Published : Jun 5, 2021, 10:16 PM IST

కొవిడ్ పరిస్థితుల్లో గిరిజన సహకార సంస్థ 450 కోట్ల రూపాయల మేర టర్నోవర్ సాధించిందని ఆ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. గత ఏడాదిలో 368 కోట్ల రూపాయల వ్యాపారాన్ని మాత్రమే చేయగలిగినా ఈసారి అటవీ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో మార్కెటింగ్ చేయడం ద్వారా ఈ టర్నోవర్​ను సాధించినట్టు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు సేకరించే చిన్నతరహా అటవీ ఉత్పత్తులను, వ్యవసాయ ఉత్పత్తులను జీసీసీ సేకరించి కనీస మద్ధతు ధరలు లభించేలా జీసీసీ ప్రయత్నిస్తోందన్నారు.

అటవీ ఉత్పత్తుల్లో తేనె, చింతపండు, కుంకుడుకాయలు, నన్నారి ఉత్పత్తులను, వ్యవసాయ ఉత్పత్తులలో కాఫీ, రాజ్మా, పసుపు, రాగి, జీడిపప్పు తదితరాలను సేకరించి బహిరంగ మార్కెట్​లో విక్రయిస్తున్నట్టు మంత్రి వివరించారు. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో అటవీ, వ్యవసాయోత్పత్తుల సేకరణకు 13.18 కోట్లను వెచ్చించినట్టు మంత్రి తెలిపారు. 2020-21 సంవత్సరంలో 76.37 కోట్లతో ఉత్పత్తుల సేకరణ జరిగిందన్నారు.

ఇదీ చదవండీ... Jagan Delhi Tour: సోమవారం దిల్లీకి ముఖ్యమంత్రి జగన్‌..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.