ETV Bharat / city

తెలంగాణ: ట్రాక్టర్​ బోల్తా.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు - one person died 12 people injured

ఇటుక బట్టీ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా..మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది.

చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
author img

By

Published : Mar 29, 2021, 7:27 PM IST

చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంథని ఓవర్ బ్రిడ్జి వద్ద ఇటుక బట్టీల కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో ఇటుక బట్టీల్లో పనిచేసే యుగేందర్ అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పెద్దపల్లి మండలంలోని గౌస్​రెడ్డి పేట ఇటుక బట్టీలకు చెందిన కూలీలు.. పెద్దపల్లికి ట్రాక్టర్​లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ట్రాక్టర్​లో 50 మందికి పైగా కూలీలు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో అధికంగా గాయాలపాలైన కూలీలకు పెద్దపెల్లిలో చికిత్స చేసిన అనంతరం కరీంనగర్ హాస్పిటల్​కి తరలించారు.

ఇదీ చూడండి : ఏప్రిల్‌ 1న కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.