రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 8,943 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 97 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ మొత్తం మరణాల సంఖ్య 2,475కు చేరింది.
రాష్ట్రంలో కరోనా నుంచి 1,80,703 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 89,907 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవదిలో 53,026 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 27.58 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.
ఇదీ చూడండి..