- BANDI SRINIVASARAO : 'ఈనెల 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తాం'
పీఆర్సీని వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ప్రభుత్వ జీవోలను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..ఈ నెల 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని ఏపీజేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడించారు. డీఏలు, 27 శాతం ఐఆర్‌తో కూడిన పాత జీతాలు ఇవ్వాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- CS Press meet: అశుతోష్ మిశ్రా కమిటీని పక్కన పెట్టలేదు: సమీర్ శర్మ
కరోనా వేళ రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిన విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సీఎస్ సమీర్ శర్మ కోరారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలను, ఉద్యోగుల వేతనాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల కంటే ఉద్యోగులకు వీలైనంత ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మధ్యంతర భృతిని వేతనంలో భాగంగా చూడకూడదని... పీఆర్సీ ఆలస్యమైనప్పుడు ఇచ్చే ఉపశనం మాత్రమేనని స్పష్టంచేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- CM JAGAN : 'డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్‌ఫ్రమ్ హోమ్ సాధ్యమవుతుంది'
వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్‌ఫ్రమ్ హోమ్ సాధ్యమవుతుందని అధికారులను సూచించారు. జూన్ నాటికి తొలిదశ డిజిటల్ లైబ్రరీలు పూర్తికావాలని ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- MP RAGHURAMARAJU: 'ఉద్యోగుల న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం నేరవేర్చాలి'
పీఆర్‌సీపై ఉద్యోగుల ఆందోళనలకు మద్దతుగా....వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దీక్ష చేపట్టారు. దిల్లీలోని నివాసంలో ఉపవాస దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఎంపీ రఘురామ ఉపవాస దీక్ష కొనసాగనుంది. ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఎంపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అప్నాదళ్, నిషాద్ పార్టీతో భాజపా పొత్తు.. ఆ వర్గాల ఓట్లపైనే ఆశలు!
ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన అప్నాదళ్, నిషాద్ పార్టీతో కలిసే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది భాజపా. మూడు పార్టీలు కలిసి మొత్తం 403 సీట్లలో పోటీ పడనున్నాయని తెలిపారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. యోగి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భాజపాలోకి బిపిన్ రావత్ సోదరుడు- టికెట్ ఖాయం!
దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్ భాజపాలో చేరారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనా విధానం నచ్చే కమలం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మాయావతి 'నామమాత్రపు' పోటీ- మరి దళితుల మద్దతు ఎవరికి?
ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో 'కులం' కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు దళిత కార్డుతో బలమైన రాజకీయ శక్తిగా కొనసాగిన బహుజన సమాజ్ పార్టీ( బీఎస్పీ) నామమాత్రపు పోటీదారుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గం ఎవరివైపు? రెండోసారి అధికారం కైవసం చేసుకోవాలని కమలం పార్టీ, పునర్వైభవం సాధించాలని అఖిలేష్ యాదవ్ గెలుపు వ్యూహాలకు పదునుపెడుతున్న వేళ.. దళిత ఓటర్ల మద్దతు ఎవరికి? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- స్టార్ సింగర్ రాలేదని ఫ్యాన్స్ రచ్చ.. స్టేజీ ధ్వంసం, వాహనాలకు నిప్పు
అనుకున్న సమయానికి లైవ్ షోలో పాల్గొనేందుకు స్టార్ సింగర్ రాలేదని ఫ్యాన్స్ విధ్వంసం సృష్టించారు. ఆగ్రహంతో స్టేజీని ధ్వంసం చేశారు. కుర్చీలు, వాహనాలను నిప్పంటించారు. ప్రముఖ భోజ్‌పురి గాయకుడు ఖేసరి లాల్ యాదవ్ గైర్హాజరు కారణంగా నేపాల్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Maxwell Record: మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. 41 బంతుల్లో సెంచరీ
Maxwell Record: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఉత్కంఠంగా 'సామాన్యుడు' ట్రైలర్.. 'జైభీమ్' మరో రికార్డు
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో విశాల్, విశ్వక్సేన్, అల్లుఅర్జున్, సూర్య చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి