ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - trending news

.

ప్రధాన వార్తలు @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM
author img

By

Published : Dec 5, 2021, 4:58 PM IST

  • Road accident in chittoor district: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
    చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద అతివేగంతో వచ్చిన కారు.. కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Former CM Rosaiah cremation: ముగిసిన రోశయ్య అంత్యక్రియలు
    మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా...ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స, పేర్నినాని, బాలినేని, వెల్లంపల్లి అంత్యక్రియలకు హాజరయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Somu On Jagan Govt: ఏపీ భాజపా తరపున.. సీఎం జగన్​కు ఆ పేరు పెడుతున్నాం: సోము వీర్రాజు
    Somu Veerraju On YSRCP Govt: ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రాయోజిత పథకాలకు సైతం ప్రధాని పేరు కాకుండా.. తన పేరు వేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు జగన్ తన పేరు పెట్టుకోవటం ఏంటని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Dead body: అక్కడ చావుకూడా ప్రశాంతంగా సాగదు..!
    Dead body: అక్కడ చివరి మజిలీలో కూడా కష్టాలు తప్పలేదు! మృతదేహం మోసే బంధువులకూ తిప్పలు తప్పలేదు. నడుము లోతు నీటిలో మృతదేహాన్ని కట్టెపై పెట్టి.. కర్రల సాయంతో అవతలి ఒడ్డుకు మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ ఘటన.. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జగన్నాథపురంలో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
    road accident in mp: మధ్యప్రదేశ్​లో శనివారం అర్ధరాత్రి రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా... ఇరవై మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'నాగాలాండ్​లో ఏం జరుగుతోంది?'- కేంద్రానికి రాహుల్​ ప్రశ్న
    Nagaland firing incident today: నాగాలాండ్​లో బలగాల కాల్పుల్లో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవటంపై కేంద్రం నిజమైన సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. పౌరుల మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Vaccination in india: 50శాతానికిపైగా వయోజనులకు వ్యాక్సినేషన్‌ పూర్తి!
    Vaccination in india: ఆదివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 127.66కోట్ల కొవిడ్​ వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వయోజనుల జనాభాలో 50శాతం మందికిపైగా రెండు డోసుల టీకాలు తీసుకున్నారని చెప్పింది. శనివారం ఒక్క రోజే కోటి డోసులు ఇచ్చామని ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథమే!'
    RBI MPC meeting: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​తో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ​రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నిర్వహించనున్న ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమావేశంలో కీలక వడ్డీరేట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఫిట్​నెస్​, స్పోర్ట్స్​పై నీరజ్ పాఠాలు.. మోదీ ప్రశంస
    Neeraj Chopra Modi: గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్డా.. ఓ కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రత్యేకంగా కలిసి స్టోర్ట్స్​, ఫిట్​నెస్​పై వారికి అవగాహన కల్పించాడు. ఈ కార్యక్రమం చాలా గొప్పదని ప్రధాని మోదీ ప్రశంసించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Akhanda movie: 'అఖండ' సక్సెస్​ మీట్​కు ఎన్టీఆర్, మహేశ్​బాబు!
    Akhanda success meet: థియేటర్లలో అభిమానుల్ని తెగ అలరిస్తున్న 'అఖండ' సినిమా సక్సెస్ మీట్ త్వరలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు మహేశ్​, ఎన్టీఆర్ విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.