- కొలువుదీరిన నూతన జడ్పీ ఛైర్మన్లు
జిల్లాలకు కొత్త జడ్పీ ఛైర్మన్లు ఎవరు..? అనే ఉత్కంఠకు తెరపడింది. మారిన సమీకరణాలు, పార్టీల గెలుపు వ్యూహాలతో ఎట్టకేలకు నూతన జడ్పీ ఛైర్మన్లు కొలువుదీరారు. జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక పూర్తైంది. 13 జిల్లాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మంత్రివర్గంలో భారీ మార్పులు.. మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (minister balineni comments on cabinet reshuffle news) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారీ మార్పులుంటాయని చెప్పారు. మంత్రివర్గంలో (ap cabinet news) వంద శాతం కొత్తవారినే తీసుకుంటామని సీఎం చెప్పారని వెల్లడించారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పినట్లు మంత్రి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం... తుపానుగా మారే అవకాశం
ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో తుపానుగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 17 కి.మీ. వేగంతో తీరం వైపు వస్తున్న తీవ్ర వాయుగుండం... కళింగపట్నంకు 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు. రేపు సాయంత్రం గోపాల్‌పూర్ - కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు: పేర్ని నాని
రైతుచట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 27న రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతునిస్తుందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం 27 అర్ధరాత్రి నుంచి 28 మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపివేయనున్నట్లు తెలిపారు. రైతుచట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా భారత్ బంద్‌కు మద్దతునిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'భారత్‌లో సంస్కరణలతో ప్రపంచం రూపాంతరం'
భారత్‌లో బలమైన ప్రజాస్వామ్యం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. (PM Modi at UNGA) ఇక్కడి వైవిధ్యమైన పరిస్థితులే అందుకు గుర్తింపు అని అన్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. ఏడాదిన్నరగా ప్రపంచం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందని కరోనాను ఉద్దేశించి అన్నారు. కొవిడ్‌కు ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- త్వరలోనే నూతన సహకార విధానం: అమిత్ షా
మోదీ ప్రభుత్వం త్వరలో నూతన సహకార విధానాన్ని తీసుకురానుందని కేంద్ర మంత్రి (Union Cooperative Minister) అమిత్ షా వెల్లడించారు. సహకార శాఖ ఏర్పాటుపై (Union Cooperation Ministry) కొందరిలో అపోహలు ఉన్నాయని పేర్కొన్న ఆయన.. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూనే పనిచేస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- న్యాయమూర్తుల విశ్వసనీయతపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యాయవ్యవస్థలోని జడ్జిల విశ్వసనీయతపై ప్రజలకున్న దృక్కోణానికి చాలా ప్రాముఖ్యత ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. అత్యున్నత నైతిక స్థానంలో ఉన్న జడ్జిలు న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందించేందుకు చాలా దూరం వెళ్తారని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Taliban news: తాలిబన్ల పాలనలో తప్పులు చేస్తే ఇలాంటి శిక్షలా..
అఫ్గానిస్థాన్‌లోని(Taliban news) హెరాత్ నగరంలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన వారికి కఠిన శిక్షను అమలు చేశారు తాలిబన్లు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురిని కాల్చిచంపారు(Afghanistan crime news). అనంతరం వారిలో ఒకరి మృతదేహాన్ని నగరంలోని ప్రధాన కూడలి వద్ద క్రేన్‌కు వేలాడదీశారు. 1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు ఉంటాయని తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా తురాబీ ప్రకటించిన కొద్ది గంటలకే ఈ ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాజస్థాన్‌పై దిల్లీ విజయం.. అగ్రస్థానం కైవసం
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్. 33 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సంజూ శాంసన్ (70) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఆ 'సినిమా' పాట.. ఎస్పీ బాలు.. జాతీయ అవార్డు
ఎన్నో వేల పాటలు పాడి, తన గాన మధుర్యంతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఎస్పీ బాలు.. ఓ సినిమాలో పాట పాడే అవకాశాన్ని తొలుత వద్దన్నారట. ఆ తర్వాత మళ్లీ మనసు మార్చుకుని ఆ సినిమాలో పాడటమే కాకుండా ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇంతకీ బాలు ఎందుకు తిరస్కరించారు? కారణం ఏంటి? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి