ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు @ 7 PM
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : Mar 30, 2021, 6:59 PM IST

  • కీలక ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా ఏపీ ఇన్​క్యాప్

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసిన కేంద్రం... చర్యలు వేగవంతం చేసింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర మౌలిక వసతుల సంస్థ - ఏపీ ఇన్‌క్యాప్‌ను ఎంపిక చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • మయన్మార్​లో పట్టుబడిన తలనీలాలతో మాకు సంబంధం లేదు: తితిదే

మయన్మార్ సరిహద్దులో పట్టుబడిన తలనీలాలతో మాకు సంబంధం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ప్రతి 3 నెలలకోసారి ఈ-టెండర్ల ద్వారా తలనీలాలు విక్రయిస్తామని పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'జగన్ సేవ వర్సెస్ జనం సేవ.. ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'

జగన్ సేవ వర్సెస్ జనం సేవ.. దేన్ని ఎంచుకోవాలో, ఏది కావాలో అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. సోము వీర్రాజుపై విజయసాయి చేసిన ట్వీట్...‌ వైకాపా భయాన్ని స్పష్టం చేసిందని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయాలి.

  • 'ఇకపై ఏపీకి అప్పులు పుట్టే పరిస్థితి లేదు'

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఓ వైపు దివాళాంధ్ర ప్రదేశ్‌గా మారుతుంటే.... సీఎం జగన్‌ తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'ఆ 10 జిల్లాల్లోనే యాక్టివ్​ కేసులు అత్యధికం'

ముంబయి, నాగ్​పుర్​ సహా మరో 10 జిల్లాలో అత్యధికంగా కొవిడ్​ యాక్టివ్​ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. కరోనా పరీక్షల నిర్వహణ ముమ్మరం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏప్రిల్​ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ఆ జైలులోని 43మంది మహిళా ఖైదీలకు కరోనా

పటియాలా జైలులోని 43 మంది మహిళా ఖైదీలు సహా ఓ చిన్నారికి కరోనా సోకింది. మిగతా ఖైదీలకు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • బంగాల్, అసోం రెండో దశ ఎన్నికల ప్రచారానికి తెర

బంగాల్​, అసోం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. బంగాల్​లో 30, అసోంలో 39 స్థానాలకు ఏప్రిల్​ 1న పోలింగ్ జరగనుంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, భాజాపా నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్​లో పోరు రసవత్తరంగా మారిన తరుణంలో ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ఆటో డెబిట్​ సేవలకు ఇక కొత్త రూల్స్

మీరు నెల నెలా చేయాల్సిన పేమెంట్స్​ కోసం ఆటో డెబిట్​ సదుపాయాన్ని ఎంచుకున్నారా? అయితే జాగ్రత్త. ఏప్రిల్ 1 నుంచి మీ చెల్లింపులు ఆగిపోవచ్చు. ఆర్​బీఐ తెచ్చిన కొత్త రూల్స్​ వల్ల మీ పేమెంట్స్ ఫెయిల్​ కావచ్చు. ఇంతకీ ఏంటా కొత్త నిబంధనలు? ఆటో డెబిట్​ ఆగిపోవద్దంటే ఏం చేయాలి? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • భువీని 'శ్రీమంతుడ్ని' చేసిన సన్​రైజర్స్​- ఫన్నీ ట్వీట్​

సరికొత్త రీతిలో ఐపీఎల్​ సందడి ప్రారంభించింది సన్ రైజర్స్​ హైదరాబాద్​ ఫ్రాంఛైజీ. తాజాగా తమ ఆటగాడు భువనేశ్వర్​కు సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసింది. అది ప్రస్తుతం వైరల్​గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • రష్మికకు ప్రియమైన కానుక.. ఎవరు పంపారు?

హీరోయిన్​ రష్మికకు తన ప్రియమైన వ్యక్తి ఎవరో ఓ ఉంగరాన్ని కానుకగా ఇచ్చారట. ఆ ఉంగరాన్ని చూసుకోని ఆమె తెగమురిసిపోతుంది. అయితే ఆ ఉంగరాన్ని ఎవరు పంపారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.