ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - top news

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు@7PM
ప్రధాన వార్తలు@7PM
author img

By

Published : Mar 23, 2021, 6:58 PM IST

  • వీఎంఆర్డీఏ పరిధిలోకి మరో 13 మండలాలు

వీఎంఆర్డీఏ పరిధిలోకి మరో 13 మండలాలు తెస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీఎంఆర్డీఏ పరిధి 7,328 చ.కి.మీ పెరిగినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • బైపోల్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు నోటిఫికేషన్

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 30 వరకు అవకాశం ఇచ్చింది. ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరపనున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • పోలీసు శాఖను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం: హోం మంత్రి

ఏపీ పోలీసు శాఖ, రాష్ట్ర పోలీసులు తమ పని తీరుతో జాతీయ స్థాయిలో పేరు, ప్రతిష్టలు పొందుతున్నారని.. రాష్ట్ర పోలీసు శాఖను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. పోలీసు స్టేషన్​కు వచ్చే బాధితులు చిరునవ్వుతో తిరిగి వెళ్లాలని, పారదర్శకంగా పోలీసు సేవలు అందాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు హోంమంత్రి సుచరిత చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ఏప్రిల్​ 18న భారీ బహిరంగ సభ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకుంటామని ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 18న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించింది. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలని చూడటం దుర్మార్గమని కమిటీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థలు మూసివేత

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • నక్సల్స్ ఘాతుకం - ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీసగఢ్​ నారాయణ్​పుర్​ జిల్లా కన్హర్​గావ్​లో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లా రిజర్వు గార్డు(డీఆర్​జీ) జవాన్లు వెళ్తున్న బస్సును ఐఈడీతో పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • పరీక్షలు పెంచాలి.. కేంద్రం నూతన మార్గదర్శకాలు

మరోసారి ఉద్ధృతి పెంచిన కొవిడ్-19 కట్టడికి నూతన మార్గదర్శాకాలు జారీచేసింది కేంద్రం. తక్షణమే ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు సహా టీకాల పంపిణీ వేగవంతం చేయాలని రాష్ట్రాలకు చెప్పింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • బంగ్లా ప్రధాని హత్యాయత్నం కేసు.. 14 మందికి మరణశిక్ష

బంగ్లాదేశ్​ ప్రధానమంత్రి షేక్​ హసీనా హత్యకు కుట్రపన్నిన 14 మంది ఇస్లామిక్​ ఉగ్రవాదులకు ఆ దేశ ఉన్నత న్యాయస్థానం మరణశిక్షను విధించింది. దోషులందరూ నిషేధిత హర్కతుల్ జిహాద్ బంగ్లాదేశ్​(హుజీ-బి)కి చెందిన ఉగ్రవాదులు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • అదరగొట్టిన భారత బ్యాట్స్​మెన్​.. ఇంగ్లాండ్ లక్ష్యం 318

ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 317 పరుగులు చేసింది. టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్​లో విరాట్, ధావన్, కృనాల్, రాహుల్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్​ 3, మార్క్ వుడ్ 2 వికెట్లు తీసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'తేజస్'​ కంగన న్యూ లుక్​.. రెహ్మాన్​ సినిమా​ ట్రైలర్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చేశాయి. 'తేజస్'​ సినిమాలోని కంగనా రనౌత్​ న్యూలుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్​ రెహ్మాన్​ నిర్మించిన '99సాంగ్స్​' చిత్ర ట్రైలర్​ విడుదలైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.