ETV Bharat / city

TOP NEWS: ప్రధానవార్తలు @ 9 AM - ఆంధ్రప్రదేశ్ వార్తలు

.

TOP NEWS
ప్రధానవార్తలు
author img

By

Published : Jul 9, 2022, 8:59 AM IST

  • బడుల విలీనం, టీచర్ల హేతు బద్దీకరణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
    HC notice to govt: రాష్ట్రంలో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ ఈ నెల 22కి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Plenary: ఆరు హామీలే అమలు చేయలేదు.. కరపత్రాల్లో వెల్లడి
    Plenary: ఇచ్చిన హామీల్లో 95శాతం నెరవేర్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి 6 హామీలను అమలు చేయలేకపోయాం.. అని వైకాపా ప్లీనరీకి వచ్చిన వారికిచ్చిన కరపత్రాల్లో ముద్రించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆత్మీయంగా జగన్‌ రాస్తున్న ఉత్తరం అంటూ 4 పేజీల బుక్‌లెట్‌ను రూపొందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • వేద, ఆగమ పాఠశాలల్లో గణితం, ఆంగ్లం, కంప్యూటర్‌ కోర్సులు
    Various courses in vedic schools: రాష్ట్రంలోని దేవాదాయశాఖకు చెందిన ఆలయాల పరిధిలో నడుస్తున్న వేద, ఆగమ పాఠశాలల్లో సంప్రదాయ విద్య నేర్చుకుంటున్న విద్యార్థులకు అదనంగా గణితం, ఆంగ్లం, సైన్స్‌, సోషల్‌, కంప్యూటర్‌ కోర్సులు కూడా బోధించేందుకు అనుమతిస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశాలు జారీచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • విజయనగరంలో విషాదం.. వర్షాలకు గోడకూలి నానమ్మ, మనవడు మృతి
    Death: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు.. వాగులు, వంకలు పొంగిపొర్లుతువన్నాయి. ఆ వర్షధాటికి గాను ఓ పెంకుటిల్లు కూలి.. ఇద్దరు మృతిచెందిన విషాదకర ఘటన.. విజయనగరంలో జరిగింది. అడ్డాల లక్ష్మి(47) అశోక్ కుమార్ రాజు (5) నానమ్మ, మనవడు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పేదింటి విద్యార్థికి రూ.2.5కోట్ల స్కాలర్​షిప్​.. అమెరికాలో ఉన్నత విద్య
    విద్యతోనే తన పేదరికాన్ని రూపుమాపొచ్చని అనుకున్నాడు ఆ విద్యార్థి. పట్టుదలతో చదివి అమెరికాలోని ఓ ప్రతిష్టాత్మక కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాన్ని సంపాదించాడు. ఇందుకోసం ఏకంగా రూ. 2.5 కోట్ల విలువైన స్కాలర్​షిప్​ను పొందాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఇది ట్రయల్ మాత్రమే.. ముందుంది అసలైన యుద్ధం'
    Russia Ukraine war: ఉక్రెయిన్​తో జరుగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పటివరకు జరిగింది ట్రయల్‌ మాత్రమే.. యుద్ధభూమిలో మాస్కో సేనలు ఇంకా తమ అసలైన చర్యను ప్రారంభించనే లేదు' అని అన్నారు. పశ్చిమ దేశాలు శత్రుత్వానికి ఆజ్యం పోస్తున్నాయిని పుతిన్‌ ఆరోపించారు. యుద్ధం ముగింపు కోసం తాను చర్చలు జరిపేందుకు సిద్ధమేనన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రధాని పదవికి రిషి సునాక్ పోటీ.. ప్రచారం షురూ.. ఎంపీల మద్దతు!
    RISHI SUNAK UK PM BID: బ్రిటన్ ప్రధాని రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు రిషి సునాక్. ఈ నేపథ్యంలోనే ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • టెలికాం రంగంలోకి అదానీ.. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి దరఖాస్తు!
    Adani into Telecom: భారత కుబేరుడు గౌతమ్ అదానీ టెలికాం రంగంవైపు దృష్టిసారించారు. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. అయితే దీనిపై అదానీ గ్రూప్‌ ఎటువంటి ప్రకటనా చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అలా జరగడం టీమ్​ఇండియాకు మంచిది కాదు.. కానీ: దాదా
    Teamindia Ganguly: టీమ్‌ఇండియాలో కొద్దినెలలుగా ఏడుగురు కెప్టెన్లు మారడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పందించాడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అంత మంది ఆటగాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగించాల్సివచ్చిందని అన్నాడు. ఇలా జరగడం అంత మంచిదేమీ కాదని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • డిసెంబర్‌ లక్ష్యంగా 'ఆర్​సీ 15'.. 'శక్తిమాన్‌'గా రణ్​వీర్​ సింగ్​
    రామ్‌చరణ్‌-శంకర్‌ 'ఆర్​సీ 15' చిత్రీకరణను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు సమాచారం. మరోవైపు 1990లలో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన సూపర్‌హీరో 'శక్తిమాన్‌' రీమేక్​ టైటిల్​ రోల్​లో రణ్​వీర్​సింగ్​ నటించనున్నారని తెలిసింది. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.