- రాజధానిలో లీజుకు గ్రూప్-డి ఉద్యోగుల భవనాలు.. సీఎం ఆమోదం
Group-D Buildings Lease: అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్యోగుల కోసం నిర్మించిన గ్రూప్ డి భవనాలను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. విట్ యునివర్సిటీకి ఒక భవనాన్ని లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఏడాదికి 8నుంచి 10కోట్ల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది.
- ఆత్మకూరు ఉప ఎన్నికలో.. విక్రమ్ రెడ్డి గెలుపు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ.. వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు.
- తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో ఏనుగులు.. భయం గుప్పిట్లో భక్తులు
Elephants in Tirumala: తిరుమలలో భక్తులను ఏనుగులు మరోసారి భయపెట్టాయి. మొదటి కనుమదారి ఏనుగుల ఆర్చ్ వద్ద ఏడు ఏనుగులు సంచరించాయి. గజరాజుల రాకతో.. వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
- అగ్నిపథ్ ఉపసంహరణకే పలు రాష్ట్రాలు డిమాండ్.. ఆగని నిరసనలు!
agneepath scheme : సాయుధ బలగాల్లో అగ్నిపథ్ పథకం కింద చేరే యువకుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. సర్వీసు పూర్తయిన నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని కొన్ని భాజపా పాలిత రాష్ట్రాలు ప్రకటించగా, భాజపాయేతర పాలిత రాష్ట్రాలు ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
- 'ఆ 40 మంది బతికి ఉన్న శవాలు.. వచ్చాక అక్కడికే పంపిస్తాం'
Maharashtra political crisis: రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. పిరికివాళ్లే పార్టీని విడిచి వెళ్లారని శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే అన్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే గుణపాఠం ఇప్పుడు నేర్చుకున్నట్లు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. రెబల్ ఎమ్మెల్యేలను బతికున్న శవాలుగా అభివర్ణించారు.
- 'పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం మాకివ్వండి'
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదన చేసింది. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను కోరింది. ఎన్నికల సంఘానికి ఈ అధికారాన్ని ఇస్తే అక్రమాలకు పాల్పడే రాజకీయ పార్టీలను నిరోధించవచ్చని తెలిపింది.
- మూడేళ్ల తర్వాత చైనాను దాటి బయటకు జిన్‌పింగ్.. కొవిడ్ తర్వాత తొలిసారి!
xi jinping hong kong visit: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ చాలా రోజుల తర్వాత విదేశీ పర్యటన చేయనున్నారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటి నుంచి ఆయన విదేశీ పర్యటనలు చేయలేదు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తొలిసారి హాంగ్‌కాంగ్‌లో పర్యటించనున్నారు. అక్కడ హాంగ్‌కాంగ్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
- Ranji Trophy: తొలిసారి ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్ టీమ్
దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ అద్భుత ప్రదర్శన చేసింది. ట్రోఫీని అందుకోవాలనే సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 2022 సీజన్ విజేతగా నిలిచి.. తొలిసారి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది. 1998-99 రంజీ సీజన్లో రన్నరప్‌గా నిలిచిన మధ్యప్రదేశ్.. ముంబయితో జరిగిన ఫైనల్ పోరులో ఆద్యంతం అధిపత్యం చెలాయిస్తూ విజేతగా నిలిచింది. ఐదురోజుల పాటు సాగిన ఈ తుదిపోరులో 6వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
- 'చోర్‌బజార్'.. ఆ నమ్మకాన్ని ఇచ్చింది: ఆకాశ్ పూరి
Chorbazaar Success meet: 'చోర్‌బజార్' సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది మూవీటీమ్. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో ఆకాశ్‌పూరి.. తన అనుభవాలను తెలిపారు. ఈ చిత్రంతో మాస్ హీరోగా మెప్పించగలననే నమ్మకాన్ని ప్రేక్షకులు తనకు ఇచ్చారని అన్నాడు.