ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

ప్రధాన వార్తలు @ 9 AM

Top News
Top News
author img

By

Published : Jan 13, 2021, 9:00 AM IST

  • భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవోలు.. చంద్రబాబు నిరసన

తెదేపా అధినేత చంద్రబాబు భోగి వేడుకలు చేసుకున్నారు. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతు వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భోగి పరమార్థం.. తెలుగు లోగిళ్లలో ఆనందోత్సాహం

లేలేత మంచుతెరల్లో నులివెచ్చని మంటలు వేకువ చీకట్లను చీల్చే కాంతి కిరణాలు ఇవిగో ఇవే భోగిపండుగకు ఆహ్వానం పలికే జ్వాలాతోరణాలు! తెలుగువారి ముచ్చటైన మూడురోజుల పండుగలో ముందుగా సందడి తెచ్చేదే భోగి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాజ్​భవన్​లో భోగి- శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి

భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బుధవారం తెల్లవారుజామున గోవాలోని రాజ్​భవన్​లో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు వెంకయ్య. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఎస్‌ఈసీ అప్పీల్‌పై 18న విచారణ

పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన సంక్రాంతి సెలవుల ప్రత్యేక ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాష్ట్రానికి 4.77 లక్షల డోసులు... నేడు జిల్లాలకు తరలింపు

రాష్ట్రానికి 4.77 లక్షల "కొవిషీల్డ్" టీకా డోస్​లు గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్నాయి. విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి షెడ్యూల్ ప్రకారం ఇతర జిల్లాలకు వ్యాక్సిన్​లను పంపించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సుప్రీంకోర్టు కమిటీపై రైతు సంఘాల పెదవివిరుపు

కేంద్రం తీసుకువచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో పోరుబాట సాగిస్తున్న అన్నదాతలకు..... కొంత ఉపశమనం లభించింది. నూతన వ్యవసాయచట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ప్రపంచవ్యాప్తంగా మరో 6.5 లక్షల పాజిటివ్​ కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజే 6.5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి రాగా.. కేసుల సంఖ్య 9కోట్ల 20 లక్షలకు చేరువైంది. కొత్తగా 15,500 పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్, స్పెయిన్​లలో వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బుకింగ్‌ చేసుకున్న రోజే గ్యాస్‌ డెలివరీ!

ఎల్​పీజీ గ్యాస్ వినియోగదారులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) త్వరలోనే శుభవార్త అందించనున్నట్లు సమాచారం. బుకింగ్​ చేసుకున్న రోజే గ్యాస్​ డెలివరీ అందించే యోచనలో సంస్థ ఉన్నట్లు ఐఓసీ అధికారి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • జడేజా బొటనవేలికి సర్జరీ.. ఆరు వారాల విశ్రాంతి

సిడ్నీ టెస్టు సందర్భంగా గాయపడిన రవీంద్ర జడేజాకు మంగళవారం శస్త్రచికిత్స నిర్వహించారు. స్థానభ్రంశమైన అతడి బొటన వేలిని వైద్యులు సరిచేశారు. ఈ విషయాన్ని జడేజా తన సోషల్​మీడియాలో వెల్లడిస్తూ.. ఓ ఫొటోను షేర్​ చేశాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఆర్​ఆర్​ఆర్​' టీజర్​ డేట్​ ఫిక్స్​.. మెగాస్టార్​ వాయిస్​ఓవర్!​

'ఆర్​ఆర్​ఆర్​' టీజర్​ విడుదలకు రంగం సిద్ధమైందని టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్రబృందం ఈ సర్​ప్రైజ్​ను ప్లాన్​ చేస్తుందట. దీనికి మెగాస్టార్​ చిరంజీవి వాయిస్​ఓవర్​ ఇవ్వనున్నారని సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.