ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - latest news

ప్రధాన వార్తలు @ 9 AM

Top News @ 9 AM
Top News @ 9 AM
author img

By

Published : Aug 29, 2020, 9:00 AM IST

  • అత్యధికుల అభిలాష అమరావతే!

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలా? లేదా? అన్న అంశంపై ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు విశేష స్పందన లభిస్తోంది. ‘ఆంధ్రప్రదేశ్‌ విత్‌ అమరావతి’ పేరుతో నిర్వహిస్తున్న ఈ అభిప్రాయ సేకరణలో... నాలుగు రోజుల వ్యవధిలోనే సుమారు 3.68 లక్షల మంది పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నేటి నుంచి తెలుగు భాషా పక్షోత్సవం

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ‘‘అంతర్జాతీయ తెలుగు భాషా పక్షోత్సవం’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి(29 ఆగస్టు) నుంచి కాళోజీ జయంతి(13 సెప్టెంబరు) వరకూ ఈ పక్షోత్సవాలను నిర్వహించనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • యూజీ, పీజీ పరీక్షలకు సన్నద్ధం..!

అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్‌ చివరి ఏడాది పరీక్షలు నిర్వహించాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణ తప్పనిసరిగా మారింది. సెప్టెంబ‌రు 30లోపు వీటిని పూర్తి చేయాలని గతంలో యూజీసీ ఆదేశాలు జారీ చేయగా.. కరోనా దృష్ట్యా రాష్ట్రాలకు ఇబ్బందులు ఉంటే సమయం పెంపు కోసం యూజీసీని సంప్రదించాలని న్యాయస్థానం సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • లోక్​సభ కార్యకలాపాలు రోజుకు నాలుగు గంటలే!

వచ్చే నెల 14 నుంచి జరగనున్న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ఒకొక్క సభను రోజుకు నాలుగు గంటలు మించి నిర్వహించుకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా.. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్​సభ కార్యకలాపాలు జరపాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మెట్రో నగరాల్లో తగ్గిన వైరస్​ ఉద్ధృతి.. కానీ!

దేశంలో కరోనా​ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నప్పటికీ.. దిల్లీ, ముంబయి, చెన్నై వంటి మెట్రో నగరాల్లో వైరస్​ ఉద్ధృతి తగ్గినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పట్టణాల్లో వైరస్​ వ్యాప్తి పెరుగుతున్నట్టు వెల్లడించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • జపాన్‌లో ఎగిరే కారు సిద్ధం!

ట్రాఫిక్​లో ఇరుక్కున్నారా.. ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ.. అనుకున్నారా? అయితే మీకోసమే 'ఎగిరే కార్లు' వచ్చేస్తున్నాయి. జపాన్​కు చెందిన స్క్రై డ్రైవ్​ అనే సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. 2023లో ఈ కారు వాస్తవ రూపంలోకి రానున్నట్టు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సెకండ్​ హ్యాండ్​లో కారు కొంటున్నారా? ఇది మీ కోసమే..

కరోనా కారణంగా చాలా మంది క్యాబ్​లు, ఆటోలలో ప్రయాణించేందుకు మొగ్గుచూపడం లేదు. ఎవరి ద్వారా వైరస్ వ్యాపిస్తుందోననే భయాలు ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో చాలా మంది సొంతంగా కారు కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అంబానీ చేతికి బియానీ వ్యాపారాలు.. నేడే ఒప్పందం!

భారత రిటైల్​ రంగంలో రిలయన్స్​ రిటైల్​ వాటా భారీ ఎత్తున పెరగనుంది. కిశోర్​ బియానికి చెందిన ఫ్యూచర్​ రిటైల్​ వ్యాపారాలు రిలయన్స్​ చేతికి చేరనున్నాయి. ఈ మేరకు నేడు ఒక ఒప్పందం కుదిరే అవకాశముంది. ఈ మొత్తం లావాదేవీ విలువ రూ.29,000-30,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వైదొలిగిన ఆర్మేనియా.. సెమీస్‌లో భారత్‌

ఫిడే ఆన్​లైన్ చెస్ టోర్నమెంట్లో భారత్ సెమీఫైనల్​కు చేరుకుంది. ఇంటర్నెట్ సరఫరాకు అంతరాయం కలగడం వల్లే తమ జట్టులో ఓ ఆటగాడు ఓడిపోయినట్లు ఆరోపిస్తూ క్వార్టర్స్​ నుంచి తప్పుకుంది ఆర్మేనియా. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సంక్రాంతి బరి.. ఏ సినిమా గురి?

టాలీవుడ్​కు రికార్డుల సీజన్​గా మారింది సంక్రాంతి. ఈ ముగ్గుల పండగకు సినిమాలు విడుదల చేసేందుకు అగ్రహీరోలు ముందుగానే బెర్త్ ఖరారు చేసుకుంటుంటారు. కానీ ఈ ఏడాది కరోనా వల్ల ఈ సీజన్​లో విడుదలయ్యే చిత్రాలపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సీజన్​ బరిలో ఉన్న చిత్రాలేంటో చూద్దాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.