- Kathi Mahesh: నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ కన్నుమూత
సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తల, శరీరంపై తీవ్ర గాయాలు అవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన కోలుకుంటున్నారని, వైద్యులు కూడా చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- DWIVEDI: 'లేటరైట్ తవ్వకాలలో ఎలాంటి అక్రమాలు జరగలేదు'
అల్యూమినియం(aluminium) తయారీలో వినియోగించే బాక్సైట్(bauxite), లేటరైట్(laterite) తవ్వకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని గనులశాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది(gk.dwivedi) వెల్లడించారు. అనుమతుల ప్రకారమే మైనింగ్(mining) జరుగుతోందని తెలిపారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారికి జరిమానా విధించామన్నారు. నిబంధనలు పాటించని లీజుదారులపై చర్యలు(action) తీసుకుంటామని ద్వివేది స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- BTECH RAVI 'రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న జగన్‌కు క్రికెట్ అవసరమా..?'
ముఖ్యమంత్రి జగన్(cm jagan) వైఖరిపై ఎమ్మెల్సీ బీటెక్ రవి(Btech Ravi) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్న జగన్ క్రికెట్ ఆడటం అవసరమా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోలవరం ప్రాజెక్టు పనులు ఆపండి'
పోలవరం నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు ప్రాజెక్టు పనులు నిలుపుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం 100 శాతం నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్
కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇటీవలే మంత్రి వర్గ విస్తరణకు ముందు.. కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన డీకే!
మాజీ మంత్రిని పరామర్శించేందుకు వెళ్తున్న సందర్భంగా ఓ కార్యకర్తపై కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ చెయ్యి చేసుకున్నారు. భుజంపై చెయ్యి వేసేందుకు ప్రయత్నించాడని.. ఆ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దేశంలోనే పొట్టి లాయర్- వయసు 24, ఎత్తు 3 అడుగులు
సంకల్పం దృఢంగా ఉంటే ఎన్ని అవరోధాలు, అవమానాలు ఎదురైనా లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు పంజాబ్‌కు చెందిన హర్విందర్ కౌర్ అలియాస్ రూబి. మూడు అడుగుల 11 అంగుళాల ఎత్తున్న ఆమె.. లాయర్ అయి అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దివ్యాంగుల కోసం కోర్టులో ఉచితంగా వాదనలు వినిపిస్తానని చెబుతున్నారు. తోటి వారు హేళన చేస్తున్నారని స్కూల్ మానేసిన రూబి.. లాయర్‌గా ఎలా మారారో తెలిస్తే ఎవరైనా ప్రశంసించకుండా ఉండలేరు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Covaxin: 'కొవాగ్జిన్'పై 4-6 వారాల్లో నిర్ణయం!
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాపై డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చే అంశంపై 4-6 వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Olympics: అథ్లెట్లలో జోష్ నింపిన భారత క్రికెటర్లు
టోక్యో ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) పాల్గొనే భారత అథ్లెట్లు విజయం సాధించాలని ఆకాంక్షించారు టీమ్ఇండియా క్రికెటర్లు. కెప్టెన్స్ మిథాలీ రాజ్(Mithali Raj), విరాట్ కోహ్లీ(Kohli) సహా పలువురు ఆటగాళ్లు 'చీర్ ఫర్ ఇండియా' అంటూ వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, వారిలో ఉత్సాహాన్ని నింపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'గని', 'లక్ష్య' చివరి షెడ్యూల్లో.. సెట్లో తారక్
సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో గని, లక్ష్య, మాస్ట్రో చిత్రాలతో పాటు తారక్ హోస్ట్‌గా ఉన్న ఓ రియాలిటీ షో గురించిన కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి