- రేపు దిల్లీకి ముఖ్యమంత్రి జగన్?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం దిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన కలవనున్నారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపటి నుంచే ఆనందయ్య మందు పంపిణీ.. ముందుగా అక్కడే..!
కరోనా నివారణకు సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొనిగి ఆనందయ్య వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పోలవరం పూర్తి చేసేందుకు వందల కోట్లు కావాలి.. కానీ!
పోలవరం ప్రాజెక్టులో ఇంకా ఎడమ, కుడి కాలువల పనులు, భూసేకరణ మిగిలి ఉండగానే వాటికి నిధులు ఇవ్వబోమని కేంద్రం ఉత్తచేయి చూపుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కరోనా' నయమవుతోంది.. పడకలు ఖాళీ అవుతున్నాయ్!
రాష్ట్రంలో కొవిడ్ పడకలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. బాధితుల సంఖ్య తగ్గడం, వ్యాధి నయమై ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యి వెళ్లేవారు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సీఎంను మార్చడమా.. అదేం లేదు'
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప కొనసాగుతారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అన్నారు. సీఎంను మార్చే ఉద్దేశం పార్టీకి లేదని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నితీశ్ విధానాలతోనే అభివృద్ధి దూరం'
బిహార్ అభివృద్ధి కుంటపడటానికి సీఎం నితీశ్ కుమార్ విధానాలే కారణమని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ఆరోపించారు. నీతి ఆయోగ్ సూచీలో బిహార్ అట్టడుగు స్థానంలో నిలవడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నా భర్తను క్షేమంగా ఆంటిగ్వా చేర్చండి'
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని క్షేమంగా ఆంటిగ్వాకు చేర్చాలని బ్రిటన్ రాణికి అర్జీ పెట్టుకోనున్నట్లు చోక్సీ భార్య తెలిపారు. తన భర్తకు న్యాయం దక్కేందుకుగాను ఆంటిగ్వా-బార్బుడా అధినేతగా సాయం అందించాల్సిందిగా బ్రిటన్ రాణికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కఠిన నిబంధనలతోనే రియల్ ఎస్టేట్ వృద్ధి'
రియల్ ఎస్టేట్ రంగానికి వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నేటి మేటి టెస్టు బౌలర్లలో అశ్విన్ ఒకడు'
టెస్టుల్లో ఉన్న మేటి బౌలర్లలో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకడని తెలిపాడు ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ ఛాపెల్. అశ్విన్‌ను ఆల్‌టైమ్ గ్రేట్‌గా పరిగణించలేమన్న సంజయ్ మాటలకు బదులుగా ఛాపెల్ ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మహిళకు అప్పుడే పరిపూర్ణమైన అందం
మహిళల్లో పరిపూర్ణమైన అందం 50 ఏళ్ల వయసులోనే కనిపిస్తుందని అంటోంది స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్(Shruthi Haasan). అమ్మాయిలు 30ల్లోనే అందంగా ఉంటారనే మాటకు తాను ఏకీభవించననని చెబుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.