ట్విట్టర్లో తన పేరుతో నకిలీ ఖాతాను సృష్టించి.. సందేశాలు పంపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని హాస్యనటుడు అలీ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ట్విటర్ అకౌంట్ లేదని.. కానీ తన పేరు మీద నకిలీ ఖాతాను గుర్తు తెలియని వారు నిర్వహిస్తూ.. మూడేళ్లుగా పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో అలీ పేర్కొన్నారు.
ఆ అకౌంట్కు ట్విట్టర్లో ఏడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారని వెల్లడించారు. ఆ అకౌంట్ వల్ల మంచి జరిగితే ఫరవాలేదని.. కానీ చెడు జరగకూడదని ఆకాంక్షించారు. అందుకే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి: