పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి మధ్య అరేబియా సముద్రం వరకూ... ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ మీదగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, తెలంగాణపై కేంద్రీకృతమై ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణశాఖ తెలియచేసింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది. రాగల మూడు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లోని విశాఖ, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలియచేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు
ప్రాంతం | వర్షపాతం |
కోటనందూరు (తూర్పుగోదావరి జిల్లా) | 7.4 సెంటిమీటర్లు |
ఇచ్చాపురం | 5.4 సెంటిమీటర్లు |
కవిటి( శ్రీకాకుళం) | 5.3 సెంటిమీటర్లు |
రామచంద్రాపురం | 5.4 సెంటిమీటర్లు |
చాట్రాయి (కృష్ణా) | 4.1 సెంటిమీటర్లు |
ఆనందపురం(విశాఖ) | 3 సెంటిమీటర్లు |
చీపురుపల్లి | 2.8 సెంటిమీటర్లు |
రాజమహేంద్రవరం | 2.5 సెంటిమీటర్లు |
పోలవరం | 2.5 సెంటిమీటర్లు |
బొబ్బిలి | 2 సెంటిమీటర్లు |
నకరికల్లు | 1.5 సెంటిమీటర్లు |
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
ప్రాంతం | ఉష్ణోగ్రత |
విజయవాడ | 26 డిగ్రీలు |
విశాఖపట్నం | 32 డిగ్రీలు |
తిరుపతి | 35 డిగ్రీలు |
అమరావతి | 27 డిగ్రీలు |
విజయనగరం | 33 డిగ్రీలు |
నెల్లూరు | 36 డిగ్రీలు |
గుంటూరు | 28 డిగ్రీలు |
శ్రీకాకుళం | 32 డిగ్రీలు |
కర్నూలు | 29 డిగ్రీలు |
ఒంగోలు | 34 డిగ్రీలు |
ఏలూరు | 31 డిగ్రీలు |
కడప | 32 డిగ్రీలు |
రాజమహేంద్రవరం | 32 డిగ్రీలు |
కాకినాడ | 32 డిగ్రీలు |
అనంతపురం | 32 డిగ్రీలు |
ప్రదేశం | జిల్లా | సంవత్సం | వర్షపాతం(సెం.మీ.) |
నెల్లూరు | నెల్లూరు | 1987 | 52.3 |
మచిలీపట్నం | కృష్ణా | 1949 | 50.2 |
కాకినాడ | తూర్పుగోదావరి | 1941 | 50.1 |
డాల్ఫినోస్ | విశాఖపట్నం | 1982 | 42.6 |
కర్నూలు | కర్నూలు | 2007 | 39.3 |
నిడదవోలు | పశ్చిమగోదావరి | 1989 | 38.9 |
నంద్యాల | కర్నూలు | 2000 | 37.6 |
కావలి | నెల్లూరు | 2007 | 35.5 |
కలింగపట్నం | శ్రీకాకుళం | 2012 | 35.5 |
ఒంగోలు | ప్రకాశం | 2010 | 32.3 |
అనంతపురం | అనంతపురం | 1932 | 31 |