కరోనా ప్రభావంతో రాష్ట్రంలో పర్యాటక రంగం కుదేలైంది. లాక్‌డౌన్ కారణంగా పర్యాటక కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు మూతపడే ఉన్నాయి. దేశంలో 606 కరోనా కేసులు, 10 మరణాలు ఉన్నప్పుడు మూతపడిన ఈ వ్యవస్థలన్నీ.... ఇప్పుడు పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారినా...ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కోసం తప్పనిసరై తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి దృష్య్టా జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించింది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రధానమైన వ్యాపార కార్యకలాపాలన్నింటినీ ప్రారంభించడం ప్రజలకు, ప్రభుత్వానికి సవాల్‌తో కూడుకున్న అంశమే.
కరోనా కట్టడి కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, మాళ్లకు వచ్చే వారికి ముఖద్వారం వద్ద థర్మల్ స్కానింగ్ చేయనున్నారు. ఎక్కడికక్కడ అందుబాటులో ఉండేలా శానిటేజర్లు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా హోటళ్లలో పనిచేసే వంటమాస్టర్లు, సప్లేయర్స్ తప్పనిసరిగా మాస్క్ లు, గ్లౌస్ లు ధరించాలని అధికారులు సూచించారు. 65 ఏళ్ల పై పడిన వారిని, 10 ఏళ్ల లోపు వారిని హోటళ్లలోకి అనుమతించకూడదని ఆదేశించారు. వ్యాపార సముదాయాల్లో ఎప్పటికప్పుడు శాని టేషన్ చేసుకుంటూ జాగ్రత్తలు వహించాలన్నారు. హోటళ్లలో, రెస్టారెంట్లలో అరిటాకులు, విస్తరాకులు వాడాలని....ప్లేట్లను వేడినీళ్లలో శుభ్రం చేయాలని సూచించారు.
రాష్ట్రంలో 28 పర్యాటక కేంద్రాల్లో కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఒంటిమిట్ట , యాగంటి, లేపాక్షి , ద్రాక్షారామం, సామర్లకోట భీమవరం, పుష్పగిరితో పాటు పలు ఆలయాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: