ETV Bharat / city

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా కేసులు.. ఇద్దరు మృతి - ap corona bulletin

TODAY CORONA CASES OF AP: రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ ధాటికి ఇద్దరు మృతిచెందినట్లు రాష్ట్ర వైద్యాఆరోగ్యశాఖ పేర్కొంది.

AP Corona Cases
ఏపీలో కొత్తగా 253 కరోనా కేసులు
author img

By

Published : Feb 23, 2022, 7:18 PM IST

రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 19,432 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 253 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ సోకి చిత్తూరు,పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 14,718 మందికి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా బారినుంచి తాజాగా 635 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,181 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

ap corona bulletin
ఏపీలో కొత్తగా 253 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

దేశంలో కరోనా కొత్త కేసులు

Covid cases in india: దేశంలో కరోనా కొత్త కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. 15,102 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 278 మంది మరణించారు. 31,377 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.28శాతానికి పరిమితమైంది. దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,76,19,39,020కు చేరింది.

  • మొత్తం మరణాలు: 5,12,622
  • యాక్టివ్ కేసులు: 1,64,522
  • మొత్తం కోలుకున్నవారు: 4,21,89,887

World Covid cases:

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆందోళకరంగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 1,628,408 కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసులు 428,280,657, మరణాలు..5,925,477కు చేరుకున్నాయి. 356,111,078 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • జర్మనీలో 158,507 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 329 మంది కరోనాకు బలయ్యారు.
  • రష్యాలో తాజాగా 135,172 కరోనా కేసులు నమోదయ్యాయి. 796 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో రోజువారీ కరోనా మరణాలు సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో 839 మంది చనిపోయారు. కొత్తగా 101,285 కేసులు వెలుగుచూశాయి.
  • దక్షిణ కొరియాలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 99,550 మందికి వైరస్​ సోకింది. 58 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కరోనా మహమ్మారి ధాటికి మరో 285 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 97,382 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన కేసులు- కొత్తగా 15వేల మందికి పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.