రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వారిని త్వరలో అరెస్టు చేస్తారని వైకాపా శాసనసభ్యుడు టీజేఆర్ సుధాకర్ బాబు చెప్పారు. తెలుగుదేశం అధ్యక్షుడు తన అనుచరులతో రాజధాని చుట్టుపక్కల భారీగా భూములు కొనుగోలు చేయించారని ఆయన ఆరోపించారు. వాళ్లందరి వివరాలు త్వరలోనే ప్రజలకు తెలుస్తాయన్నారు. చంద్రబాబుకు తన అనుచరుల భూములు బయటపడిపోతున్నాయనే భయం పట్టుకుందని విమర్శించారు.